ఆంధ్రా జిమ్ జగన్

-కిమ్ సొంత బాబాయిని లేపేశారు
-ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా?
-ఐదేళ్లలో బీసీలకు మీరు పొడిచింది ఏమిటి?
-ఉరవకొండ – లత్తవరం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్

ఉరవకొండ : నార్త్ కొరియాలో నియంత ఉన్నాడు.. ఆయన పేరు కిమ్. ఆంధ్రాలో కూడా ఒక నియంత ఉన్నాడు..అతని పేరు జిమ్. హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరూ సేమ్ టూ సేమ్. కిమ్ కు నార్త్ కొరియాలో 17 ప్యాలెస్ లు ఉంటే జగన్ కు 6 ప్యాలెస్ లు ఉన్నాయి.

కిమ్ సొంత బాబాయిని లేపేశారు, సొంత అన్నని లేపేశారు. ఆంధ్రా జిమ్ జగన్ కూడా సొంత బాబాయిని లేపేశాడు. జిమ్ సొంత తల్లి, చెల్లిని కూడా మెడపట్టుకుని గెంటేశాడు.

కిమ్ వీడియో గేమ్ లు ఆడతాడు, జగన్ పబ్ జీ ఆడతాడు. కిమ్ దొంగ నోట్లు, మాదకద్రవ్యాలతో దోచుకుంటారు. జగన్ కూడా దొంగనోట్లు, గంజాయి డ్రగ్స్, నాసిరకం మందు విక్రయిస్తాడు. నార్త్ కొరియాలో కిమ్ 340 మందిని చంపేశాడు. ఆంధ్రా జిమ్ వేలాది మంది జైలుకు పంపాడు.

ఆంధ్రా కిమ్ ఎస్సీ, ఎస్టీలను ఇబ్బంది పెట్టారు, అనేక మంది చంపారు. దళిత డాక్టర్ సుధాకర్ ను ఏకంగా హింసించి చనిపోయేలా చేశారో చూశాం. హామీ నిలబెట్టుకోవాలన్నా అంగన్ వాడీలను కొట్టి జైలుకు పంపారు. నార్త్ కొరియాలో కిమ్ తనను ప్రశ్నిస్తే.. సంక్షేమ పథకాలు కట్ చేస్తాడు. ఏపీలో జిమ్ కూడా అంతే. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా జైలుకు పంపిస్తాడు ఈ జిమ్ జగన్.

నాపై 22 కేసులు పెట్టారు. ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా.. జగన్. నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని వెబ్ సైట్ లో కొడితే నేను చెప్పినవన్నీ వస్తాయి. జగన్ ను నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. డేట్, టైం నువ్వు ఫిక్స్ చేస్తే నీ బూమ్ బూమ్ షాపు వద్దకు వెళ్దాం, ప్రజలు ఏం అనుకుంటున్నారో చూద్దాం. నువ్వు సిద్ధమా?

జగన్ రోజూ బూమ్, బూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, ప్రజల రక్తం రుచిమరిగారు. క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి నుంచి రోజు 25 రూపాయలు వసూలు చేస్తున్నారు. నెలకు 750, ఏడాదికి రూ.9వేలు, ఐదేళ్లలో 45వేలు లాగేసుకుంటున్నారు. ఈ చేత్తో పది ఇచ్చి మరో చేత్తో 100 లాగేసుకుంటున్నారు.

యువగళం పాదయాత్రలో నాసిరకం మద్యం తాగి ముగ్గురు చనిపోయారని, అనకాపల్లిలో ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. జే-బ్రాండ్ విషం కంటే దారుణం. ఎప్పుడూ లేనివిధంగా మనుషులు చనిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా మనుషుల లివర్లు నాశనం అవుతున్నాయి.

నాసిరకం మద్యాన్ని టెస్ట్ లకు పంపిస్తే.. పంట పొలాల్లో పురుగుమందులు కొడితే పురుగులు చనిపోవు కానీ.. ఈ నాసిరకం మద్యం కొడితే చనిపోతాయి. అలాంటి దారుణమైన మందు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాదుడే బాదుడు. ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచి, క్వార్టర్ బాటిల్, ఇంటి పన్ను, చెత్తపన్ను పెంచి, నిత్యావసర ధరలు పెంచి బాదుడే బాదుడు.

జగన్ ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. ఐదేళ్లలో బీసీలకు మీరు పొడిచింది ఏమిటి? 26వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారు. 300 మంది బీసీలను చంపేశారు.

అనంతపురం జిల్లా అంటే మాకు ఎంతో ప్రేమ. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో అభిమానం చూపిస్తారు. పాదయాత్రలో ఇదే ఉరవకొండలో నా చేయి పట్టుకుని కొరికారు.

అన్న ఎన్టీఆర్ ను ఎమ్మెల్యేగా చేసి, ముఖ్యమంత్రిని చేసిన జిల్లా అనంతపురం. ఇంకో మామయ్య హరికృష్ణ ని గెలిపించారు. మీ అందరి బాలయ్య, నాకు ముద్దుల మామయ్య బాలయ్య ని రెండుసార్లు గెలిపించారు. అందుకే డబుల్ ప్రేమతో ఐదేళ్లలో అనంతను టీడీపీ ఎంతో అభివృద్ధి చేసింది. రోడ్లు, బ్రిడ్జిలు మనం కట్టినవే. విజనరీ చంద్రబాబుకు, ప్రిజనరీ జగన్ కు తేడా గమనించాలి.

వైఎస్ హయాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8844 ఎకరాలు భూసేకరణ చేశారు. 10వేలకోట్లు విలువచేసే ఆ భూమిని సిఎం మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి 500 కోట్లకు కొట్టేయాలని చూశాడు. ఆ భూములను వెనక్కి తీసుకుని పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం.
వైసిపి పాలనలో ఎక్కడ చూసినా భూదందా, ఇసుక దందా.

వైసీపీ శాసనసభ్యుడు విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ఏనాడు నాకు ఇది కావాలని అప్పుడు, ఇప్పుడు అడగలేదు. జగన్ రెడ్డి ఇచ్చిన హామాీలు నిలబెట్టుకోవాలని ఏనాడూ అడగలేదు.

ఆయన, ఆయన కొడుకు కలిసి నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు. దొంగ ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, పత్రాలు సృష్టించి భూములు కొట్టేస్తున్నారు. పొరపాటున మీ ఇల్లు చూపిస్తే… మీ ఇల్లు నచ్చితే దానిని కూడా స్వాహా చేస్తారు. భూములు, ఇసుక స్వాహా చేస్తున్నారు.

Leave a Reply