కర్ణాటక నుంచి నీళ్లు అడిగి తెచ్చే సోయి లేదా?

– రైతుల పేగులు రేవంత్ మెడకు పడుతున్నాయి.
– మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

రాష్ట్రం లో కాంగ్రెస్ పాలన కు మూడు నెలలు పూర్తయ్యాయి. మార్పు తెస్తామని రాష్ట్రాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తున్నారు. ప్రజలు మరింత బాగు చేస్తామని కాంగ్రెస్ చెబితే నమ్మారు. మూడు నెలల్లో ప్రజలకు గతం లో దక్కిన మేళ్లు కూడా రావడం లేదు. కాంగ్రెస్ పాలనలో అనేక అవకాశాలను ప్రజలు కోల్పోతున్నారు.

సాగు తాగు నీళ్లకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ నేతల కు కర్ణాటక నుంచి నీళ్లు అడిగి తెచ్చే సోయి లేదా? ముఖ్యమంత్రి మానవ బాంబులు ,మెడలో పేగులు వేసుకోవడం గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ తీరుతో రైతుల పేగులు రేవంత్ మెడకు పడుతున్నాయి.

రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొడుతా అంటారు ఓ మంత్రి . సాగునీటిపై ప్రభుత్వం ఒక్కరోజైనా సమీక్ష చేసిందా? ప్రభుత్వం పంట దిగుబడిపై అంచనా వేసిందా? ఇప్పటికి కూడా కాళేశ్వరం నీటిని వాడుకునే అవకాశం ఉంది. ఎకరా పంట ఎండి పోకుండా కాపాడవచ్చు.

మంచి నీళ్ళు లేవని,పంటలు ఎండి పోయాయని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే కేసు లు పెడుతున్న ప్రభుత్వం ఇది.కరువు,వ్యవసాయం పై సీఎం ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఢిల్లీకి ముడుపులు ముట్ట చెప్పేందుకే సీఎం కు ఆసక్తి ఉంది తప్ప రాష్ట్రం లో సమస్యల పరిష్కారం పై ముందస్తు ప్రణాళిక లేదు. రేవంత్ గురువు బాబు సీఎం గా ఉన్న సమయంలో జరిగిన ఘటనలు మళ్ళీ మొదలయ్యాయి

Leave a Reply