కాపులకు సిగ్గు, లజ్జ ఉంటే జగన్ మోహన్ రెడ్డికి ఓట్లు వేయరు

– కాపులు పవన్ కళ్యాణ్ కు కాకుండా జగన్ కు ఓటేస్తే అడుక్కు తిన్నట్లే
– రంగాను చంపించింది రాజశేఖర్ రెడ్డి
రంగా ను చంపింది టిడిపి వాళ్ళు కాదు, దేవినేని బ్యాచ్ అంతకన్నా కాదు
– కమ్మ వారి అల్లుడు రంగాను చంపాల్సిన అవసరం ఆ కులం వారికి లేదు
– టిడిపి -జనసేన కాపు కుల ఆత్మీయ సమ్మేళనం లో తిరువూరు టిడిపి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్

పేద ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాల్లోకి వచ్చిన నేత రంగా. కులం, మత, వర్గ విభేధాలకు తావు లేకుండా బడుగు, బలహీన వర్గాల కోసం బహుజన సమాజం ను స్థాపించిన నాయకులు వి ఏం రంగా. 35 సంవత్సరాల తర్వాత కూడా పేద ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిన నేత రంగా.

ఆనాడు రాష్ట్ర చరిత్రలో ఖమ్మం లో ఇందిర గాంధీ బహిరంగ సభ ఓ చరిత్ర. ఆ రికార్డు దివంగత ఎన్ టి ర్ బ్రేక్ చేస్తే, ఆ రికార్డు ను బ్రేక్ చేసిన ఘనత వి ఏం రంగాకే దక్కింది. రంగా ను చంపింది టిడిపి వాళ్ళు కాదు, దేవినేని బ్యాచ్ అంతకన్నా కాదు. అ పని చేసింది రాయలసీమ గుండాలు గుండాలు.రాజశేఖర్ రెడ్డి మనుషులు.

కమ్మ వారి అల్లుడు రంగాను చంపాల్సిన అవసరం ఆ కులం వారికి లేదు. రంగా కాబోయే ముఖ్య మంత్రిగా ఎదుగుతున్న సందర్భంలో కక్ష కట్టి రంగా ను చంపించింది వైఎస్సార్. కాంగ్రెస్ లో అసమ్మతి నేత గా అడ్డొచ్చిన ప్రతి నేతను భౌతికంగా లేకుండా చేసింది రాజశేఖర్ రెడ్డి.

పవన్ కళ్యాణ్ రాజకీయ వేత్త కాదు, ఆయన ఓ సంఘ సంస్కర్త. కాపులకు సిగ్గు, లజ్జ ఉంటే జగన్ మోహన్ రెడ్డి కి ఓట్లు వేయరు. కూటమి అధికారం లోకి వచ్చాక విజయవాడ లో రంగా గారి 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తా. నేను రంగా గారి అభిమానిని కాదు భక్తుడిని, చిరంజీవి అభిమానిని. చేయి చేయి కలుపు చేజారదు గెలుపు – ఇదే రాధా. రంగన్న పిలుపు. ఈ స్లోగన్ ఆదర్శం గా చేసుకుని ప్రతి కాపు బిడ్డ టిడిపి -జనసేన కూటమికి ఓటు వేయాలి. కాపులు పవన్ కళ్యాణ్ కు కాకుండా జగన్ కు ఓటేస్తే అడుక్కు తిన్నట్లే.

Leave a Reply