జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం..

జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం లేదా అస్తవ్యస్తం అంటున్నారు, కాని జరిగింది ఆర్థిక అణు విస్ఫోటనం.జగన్ ప్రభుత్వం తప్పిన ఆర్థిక క్రమశిక్షణ ప్రభావం శిక్ష భవిష్యత్తు తరాల మీద మోయలేని భారం పడనుంది.రాబోయే 7 సంవత్సరాలలో రాష్ట్రం 1.10 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చాలి, కాని ప్రస్తుతం వడ్డీ కట్టడానికి అదనపు అప్పులు చేయాల్సిన పరిస్థితి.
రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూ లోటు 2020-21 నాటికి సున్న కి వచ్చే పరిస్థితి నుండి నేడు 36 వేల కోట్ల రెవెన్యూ లోటు కు తెచ్చి రాష్ట్రానికి జగన్ గుండు సున్న కొట్టారు.రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ పాలసీ క్రింద 5,600 కోట్లు మాత్రమే ఇవ్వాలి, ఇప్పటికే 1 లక్ష కోట్ల రూపాయల దాటి మరో 1 లక్ష కోట్ల పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.నిభంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీల శాతం 90% నుండి 180% పెంచి గోల్ మాల్ గోవిందం లా రాష్ట్రంలో పాలన సాగుతోంది.
కాసుల కోసం కార్పోరేషన్ల ద్వారా కల్పిత ఆదాయంతో లక్షల కోట్ల రూపాయల రుణాలు సేకరిస్తున్న జగన్ ప్రభుత్వం.లక్షణం గా పాలన చేయమని ప్రజలు అవకాశం ఇస్తే, లక్షల కోట్ల రూపాయల అప్పులను ఆదాయం సృష్టించే ఆస్తుల కల్పన లేకుండా వృదా వ్యయంతో వనరుల నిర్వీర్యం జరుగుతుంది.ప్రభుత్వ పాలన తీరు వికాసం వైపు నడవాలి. కాని రాష్ట్రంలో విధ్వంసం, విస్ఫోటనం వైపు ప్రయాణం సాగుతుంది.

Leave a Reply