బీజేపీకి, వైసీపీకి తేడా లేదు

-‘సిద్దం’ సభలతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా
-‘సిద్ధం’ సభ గా లేవు.. వైయస్ జగన్ “వీడ్కోలు” సభ గా ఉన్నాయి
-‘భర్తీ భరోసా’ పేరుతో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం
-ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ,రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. జగనన్న అయితే బీజేపీతో రహస్య పొత్తుతో నడుస్తున్నారు. బీజేపీకి బానిసగా బతకాల్సిన ఖర్మ ఎందుకు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిన బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ అనే హామీతో జగన్ అన్న అధికారంలోకి వచ్చారు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ విడుదల చేశారు.

బీజేపీకి, వైసీపీకి అసలు తేడా ఏముంది?. ఏపీలో బీజేపీకి బీ పార్టీగా వైసీపీ ఉంది. బీజేపీకి వారసులని జగన్ నిరూపించుకున్నారు. ‘సిద్దం’ సభలతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా చేస్తున్నారు. జనాలను పోగేసుకుని మళ్లీ మాయ చేస్తున్నారు.’సిద్ధం’ సభ గా లేవు. వైయస్ జగన్ “వీడ్కోలు” సభ గా ఉన్నాయి.

బీజేపీతో అంటకాగే పార్టీ లకు ప్రజలు బుద్ధి చెప్పాలి. యువకుల కోసం కాంగ్రెస్ నేషనల్ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ‘భర్తీ భరోసా’ పేరుతో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.రాహుల్ గాంధీ యువత, నిరుద్యోగ సమస్యలపై స్పందించి ఈ మ్యానిఫెస్టో రూపొందించారు.

Leave a Reply