చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్ నైజం

-మేదరమెట్లలోనూ జగన్ అబద్దాల విషపు జల్లు

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

హామీలు నిలబెట్టుకున్నానన్న జగన్ మాట.. పచ్చి అబద్ధం. 85% హామీలు అమలు చేయకుండా మాట తప్పాడు. సంక్షేమానికి బడ్జెట్ లో జగన్ 15% ఖర్చు చేయగా.. చంద్రబాబు 19% ఖర్చు చేశారు. బాబాయి గొడ్డలివేటు పాపంతో పులివెందులలో ఎలా గెలుస్తావో చూసుకో. జగన్ కల రూ.10 లక్షల కోట్ల దోపిడి.. జిల్లాకొక సొంత ప్యాలెస్ నిర్మాణం. ప్రజా విశ్వాసం కోల్పోయినందునే సభకు నిండా లక్ష మంది కూడా రాలేదు. తన మోసాల్ని టీడీపీకి అంటగట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం జగన్ నైజం.

1. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్.. మాట తప్పి మడమతిప్పాడు. ఓటు అడిగే హక్కు కోల్పోయాడు. నాసిరకం మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశాడు. నాసిరకం మద్యం వల్ల కిడ్నీ, లివర్ చెడిపోయి 30,000 మంది ప్రాణాలు పోయి, వారి భార్యల మాంగల్యాలు మంట కలిశాయి. నాసిరకం మద్యంలో జగన్ లక్ష కోట్లు కమిషన్ కొట్టేశాడు. అందుకే డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు.
2. 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి మాట తప్పాడు.
3. అధికారంలోకి వచ్చిన వారంలో.. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మాట తప్పాడు.
4. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా రూ.1000 పెంచుతానని హామీ ఇచ్చి మాట తప్పాడు.
5. విద్యుత్ చార్జీలు పెంచనన్న హామీకి విరుద్ధంగా 9సార్లు పెంచి.. రూ.64 వేల కోట్ల కరెంటు చార్జీల భారం ప్రజలపై మోపి మాట తప్పాడు.
6. ఇసుక సరఫరాపై మాట తప్పాడు. ఉచిత ఇసుకను రద్దు చేసి రూ.50 వేల కోట్ల కుంభకోణం చేశాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి పోగొట్టాడు.
7. ఇద్దరు బిడ్డలకు అమ్మ ఒడి హామీపై మాట తప్పాడు. అమ్మ ఒడికి రూ.13,000 ఇచ్చి నాన్న బుడ్డిలో లక్ష కొట్టేస్తున్నాడు. ఇలా నవరత్నాలను నవమోసాలు చేశాడు. ఫీజు రీయంబర్స్ మెంట్ చంద్రబాబు 16 లక్షల మందికి ఇవ్వగా.. దాన్ని జగన్ 9 లక్షలకే కుదించి 7 లక్షల మంది విద్యార్థులకు నష్టం చేశాడు.
8. రైతు భరోసాకు రూ. 12,500 హామీపై మాట తప్పాడు. రాష్ట్ర నిధుల నుండి రూ.7,500 మాత్రమే ఇస్తున్నాడు. కేంద్రం ఇచ్చేరు రూ.6,000 తానే ఇచ్చినట్టుగా అబద్ధాలు చెబుతున్నాడు. పైగా ఒక్కో రైతుకు లక్ష రూపాయలు లబ్ది చేకూర్చిన రైతు రుణమాఫీని రద్దు చేశాడు.
9. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తానన్న హామీపై మాట తప్పాడు.. పైగా పెట్రోల్ రేట్లలో ఏపీ దేశంలో మొదటి స్థానంలో ఉంది.
10. 25 లక్షల పక్కా ఇళ్లు ఉచితంగా నిర్మిస్తానన్న హామీపై మాట తప్పాడు. ఇంటి నిర్మాణాల పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశాడు. సెంటు పట్టా పేరుతో రూ.7వేల కోట్లు కుంభకోణం చేశాడు.
ఇలా 85% హామీలు అమలు చేయకుండా మాట తప్పాడు. మడమతిప్పాడు. 99% హామీలు అమలు చేశానని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. పంచాయతీలు, మున్సిపాల్టీలకు కేంద్రం పంపిన 12వేల కోట్ల నిధులను జగన్ దారి మళ్లించి స్థానిక సంస్థల్ని నాశనం చేశాడు.
11. ధరలు, పన్నులు, చార్జీలు, అప్పుల బాదుడుతో ఒకే కుటుంబంపై రూ. 8లక్షల భారం మోపాడు. ఇచ్చేది గోరంత, కొట్టేసేది కొండంత.
12. అన్న క్యాంటీన్లు, పండగ కానుకలు, నిరుద్యోగ భృతి, పసుపు కుంకుమ లాంటి 120 చంద్రన్న సంక్షేమ పథకాలు రద్దు చేశాడు.
13. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు ఒక లక్ష కోట్లు దారి మళ్ళించాడు.
14. 14 లక్షల అసైన్మెంట్ భూములను వైసీపీ మూకలు కబ్జా చేశారు.
15. ప్రశ్నించిన దళిత, బడుగు, బలహీన వర్గాల 1000 మందికిపైగా హత్యలు చేశారు.
16. జగన్ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయి. నేర పానలో ఐదు కోట్ల మంది బాధితులే.
17. బాధితులందరూ ఏకమయ్యారు. ప్రజా ఆకాంక్ష మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటై నియంత దోపిడీని అంతం చేస్తామని జగన్ భయపడుతున్నాడు.
18. జగన్ కు ప్రజాబలం ఉంటే ప్రతిపక్షాల ఐక్యతను చూసి ఎందుకు భయపసడుతున్నారు?.
19. ప్రతిపక్షాల ఐక్యతతో జగన్ ఎన్నికల అక్రమాలు సాగవని ప్యాంట్లు తడుపుకుంటున్నారు. తన చుట్టూ ఉన్న వేలాదిమంది మాఫియాల ఆటలు సాగవని బెంబేలెత్తుతున్నాడు.
20. ప్రజల్ని మోసం చేయడానికి, మాయ చేయడానికి మేదరమెట్లకు 6 జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుండి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో వంద కోట్లు ఖర్చు చేసి జనాన్ని తరలించే ప్రయత్నం చేశారు. అయినా సభ వెలవెలబోయింది. అందుకే మీడియాపై ఆంక్షలు పెట్టారు. జగన్ ది వాపే గానీ బలం కాదని తేలిపోయింది.

 

Leave a Reply