– అన్యాయాన్ని అక్రమాన్ని చీల్చి చెండాడుతుంది
-జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిలమ్మ 3112 km పాదయాత్ర చేసింది
-ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గం సత్తుపల్లి బస్టాండ్ సర్కిల్ లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ భారీ బహిరంగ సభ
– పాదయాత్రలో బాగంగా సభకు హాజరైన వైఎస్ షర్మిల
– ముఖ్య అతిథిగా సత్తుపల్లి సభకు హాజరైన వైఎస్ విజయమ్మ
వైఎస్ విజయమ్మ ఏమన్నారంటే..వైఎస్సార్ కలలు కన్న సంక్షేమ తెలంగాణ వచ్చే వరకు ఈ ప్రజా ప్రస్థానం ఆగదు. ఆనాడు వైఎస్సార్ పాదయాత్ర దేశంలో పెను మార్పులు తీసుకొచ్చింది. ఆనాటి పాదయాత్ర అధికార పార్టీ లో ప్రకంపనలు సృష్టించింది. ఆనాటి పాదయాత్ర హరితాంద్ర ప్రదేశ్ రూపకల్పన జరిగింది.
ఈ తెలంగాణ గడ్డ మీద షర్మిల ప్రజాప్రస్థానం సరి కొత్త చరిత్ర సృష్టిస్తుంది. షర్మిలమ్మ వేసే ప్రతి అడుగు వైఎస్సార్ ఆశయాలు నెరవేరుస్తుంది. వైఎస్సార్ కుటుంబాన్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు. బ్రతికినంత వరకు మీ ప్రేమకు ఈ జీవితం అంకితం.షర్మిలమ్మ కి వైఎస్సార్ ఒక ప్రపంచం. ఒక మహారాణి లా చూసుకున్నారు. కాలు కూడా కింద పెట్టనివ్వకుండ చూసుకున్నారు.
షర్మిలమ్మ అంటే వైఎస్ఆర్ కి అమితమైన ప్రేమ. వైఎస్సార్ కి తనకు ఉన్న అనుంబందం అంతా ఇంతా కాదు. కాలం నాకు నా బిడ్డలకు చాలా పాఠాలు నేర్పించింది.అట్టడుగు ఉన్న కాంగ్రెస్ ను వైఎస్సార్ పైకి తీసుకొచ్చారు. వైఎస్సార్ మరణాంతరం మా కుటుంబాన్ని వదిలి పెట్టింది కాంగ్రెస్ పార్టీ.
వైఎస్సార్ చనిపోయిన తర్వాత FIR లో పెట్టి వదిలేశారు. వైఎస్సార్ పులివెందుల లో పుట్టి కడపలో రాజకీయ నాయకుడు. ఎదిగినా…మీరంతా నమ్మి గొప్ప నాయకుడిని చేశారు.వైఎస్సార్ ప్రేమ కి హద్దులు లేవు…ఎల్లలు లేవు. కులాలకు మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేశారు. వైఎస్సార్ మనిషిని మనిషిగా ప్రేమించారు.
తెలంగాణ సంక్షేమానికి పెద్ద పీట వేశారు.ఈ గడ్డ కూడా వైఎస్సార్ కుటుంబానికి అండ గా నిలిచింది.2009 లో మహాకూటమి ఓటమికి ఈ గడ్డ నుంచే కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయి. రాజన్న లేడు అంటే వందల కుటుంబాల్లో పెద్ద దిక్కును కోల్పోయారు..చాలా బాధ అనిపించింది.
జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిలమ్మ 3112 km పాదయాత్ర చేసింది.ఈ గడ్డ మీద కూడా పాదయాత్ర లో ప్రజలు అక్కున చేర్చుకున్నారు.ఇదే ఖమ్మం జిల్లాలో 51 డిగ్రీల ఎండలో పాదయాత్ర చేసింది.ఆనాటి పాదయాత్ర మళ్ళీ అదే ఎండలో ఇప్పుడు చూస్తాను అనుకోలేదు.గొప్ప సంకల్పం తో ప్రజలకు సేవ చేయడానికి మళ్ళీ షర్మిలమ్మ మీ ముందుకు వచ్చింది.
ప్రజలు స్వయం సమృద్ది తో ఎదగాలని ఆకాంక్ష తో ముందుకు వచ్చింది. పాదయాత్ర చేస్తావా అని అడిగినప్పుడు వైఎస్సార్ మాటలను షర్మిలమ్మ గుర్తు చేసింది.ప్రజల కోసం ఎలా బ్రతికాం ఆన్న వైఎస్సార్ మాటలను షర్మిలమ్మ గుర్తు చేసింది. వైఎస్సార్ కి తెలంగాణ ప్రజలు ఆత్మబంధువులు.
షర్మిలమ్మ కి వైఎస్సార్ స్ఫూర్తి.ప్రజల కోసం కృషి చేసే నాయకులను ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. వైఎస్సార్ అనే వారు మనం గెలవాల్సింది ఎన్నికలు కాదు… ప్రజల మనసులు గెలవాలని మాటలో సత్యం ..మాటలో నిజాయితీ ఉండాలని వైఎస్సార్ చెప్పే వారు.
ప్రజలకు ఏమన్నా ఇవ్వాలన్న మంచి మనసు ఉండాలి. మనసున్న నాయకుడు కాబట్టే వైఎస్సార్ అడిగింది ఇచ్చారు. నాయకుడు అంటే ఒక నమ్మకం..ఒక ఆత్మీయత..ఒక ఆప్యాయత. నాయకుడు అంటే ఒక దార్శనికత. మనసున్న మనిషిగా మీతోడు ఉంటానని మీ ఇంటికి వస్తుంది షర్మిలమ్మ. ఎర్రటి ఎండకు బయపడ దు. వానలకు భయపడదు.షర్మిలమ్మ ఒక ఆడపిల్ల కాదు..అడవిపులి అని తెలుసుకోండి. అన్యాయాన్ని అక్రమాన్ని చీల్చి చెండాడుతుంది. ప్రతి పోరాటంలో షర్మిలమ్మ మీ ముందు ఉంటుంది. మీ నమ్మకాన్ని నెరవేరుస్తుంది.