– టిడిపి నేతలు టెన్త్ ఫలితాలపై పిల్లలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి విఫలం అయ్యి ఇప్పుడు గ్రూప్-1 అభ్యర్థుల జీవితాలపై కుట్రలు చేస్తున్నారు
– ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు అండగా జగన్ మోహన్ రెడ్డి
– కాంగ్రెస్ ముందుగా తమ పార్టీ అధ్యక్షుడిని నిర్ణయించుకోని, ఆ తర్వాత భారత రాష్ట్రపతి అభ్యర్థి గురించి ఆలోచించాలి
– ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి
తెలుగుదేశం పార్టీ నేతలు పదో తరగతి ఫలితాలపై పిల్లలను రెచ్చగొట్టి ‘దేనికోసమో’ చేసిన ప్రయత్నాలు ‘ఫెయిల్’ అయ్యాయని,ఇప్పుడు గ్రూప్-1 అభ్యర్థుల జీవితాలపై కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పలు అంశాలపై ఆయన మంగళవారం ట్విట్టర్ లో స్పందించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అతని కుమారుడు లోకేశ్ లు ప్రజలను రెచ్చగొట్టడం,జనాల మధ్య పుల్లలు పెట్టడం జన్యురీత్యా వచ్చిన నక్క బుద్ధి వీళ్ళదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు హయాంలో ఎపిపిఎస్సీలో తన అనుయాయు లతో నింపేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014లో అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చక రైతులను నట్టేట ముంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం నేటి వరకు రైతన్నలకు రూ.1,27,823 కోట్ల మేర సాయం అందించారని ఆయన వెల్లడించారు.
ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు అండగా జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందిస్తోందని చెప్పారు. 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని సీఎం జగన్ గారు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారని ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దింపుతోందని వెల్లడించారు. కాంగ్రెస్ ముందుగా తమ పార్టీ అధ్యక్షుడిని నిర్ణయించుకోవాలని, ఆ తర్వాత భారత రాష్ట్రపతి అభ్యర్థి గురించి ఆలోచించాలని ఆ పార్టీకి హితవు పలికారు.
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీని కలిసిన ఎంపి విజయసాయిరెడ్డి
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీని వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి మంగళవారం ఢిల్లీలో కలిశారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సామాజిక-ఆర్థిక-విద్యా సాధికారత, ఉపాధి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై విజయసాయిరెడ్డి తో చర్చించినట్టు కేంద్రమంత్రి నక్వీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు పోస్టు చేశారు.
కామర్స్ స్టాండింగ్ కమిటీ నివేదికలను నేడు రాజసభ చైర్మన్ కు సమర్పించనున్న ఎంపి విజయసాయిరెడ్డి
వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు, కామర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ వి.విజయసాయి రెడ్డి రాజ్యసభ అధ్యక్షులు ఎం. వెంకయ్య నాయుడును ఢిల్లీలో బుధవారం వారి నివాసంలో కలిసి కామర్స్ స్టాండింగ్ కమిటీ నివేదికలను సమర్పిస్తారు.