-చంద్రబాబుని సైకియాట్రిస్టుకో,బూతవైద్యుడికో చూపించాలి
-ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై మండిపడ్డ ఎంపి విజయసాయిరెడ్డి
టీడీపీ అంటే తెలుగు దున్నపోతుల పార్టీగా వైస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభివర్ణించారు. ట్విట్టర్ వేదికగా శనివారం నాడు ఆయన తెలుగుదేశం పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.
లోకేష్ మంత్రిగా పని చేసినా, పనికిమాలిన తెలివి తక్కువ వాడు కాబట్టే దత్తపుత్రుడే మెరుగని చంద్రబాబు అనుకున్నాడని చెప్పారు. ఇది తెలిసిన తరువాత కూడా చీమూ, నెత్తురూ ఉన్న ఎవడైనా అదే పార్టీలో అలాగే కొనసాగగలడా? అంటూ లోకేశ్ ను ప్రశ్నించారు.కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోదీలను పట్టుకుని ఉత్తరాంధ్రకు ఎవరువీళ్ళు
అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు గాలి సోకిందో, మతిపోయిందో తెలియట్లేదని అర్జంటుగా సైకియాట్రిస్టుకో, బూతవైద్యుడికో చూపించాలని సలహా ఇచ్చారు.ఎవరికైన పిచ్చి కుక్క కరిస్తే వారికి వెంటనే ఆసుపత్రికి పంపిస్తామని,అదే టీడీపీలో అయితే చంద్రబాబు అనే పిచ్చి కుక్క కరిచిన వారిని అధికార ప్రతినిధులుగా పంపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.