Suryaa.co.in

Andhra Pradesh

ఢిల్లీ లిక్కర్ స్కాంకు విజయసాయిరెడ్డి కుటుంబానికి దగ్గర సంబంధాలు

-ఏపీ సమస్యలపై ఢిల్లీలో పోరాడేందుకు విజయసాయిరెడ్డిని ఎంపీస్తే.. ఢిల్లీలో సారా వ్యాపారం చేస్తారా?
ఏపిలో కల్తీ మద్యం వ్యాపారం చేసి అనేక మంది ప్రాణాలు తీసి ఆంధ్ర నుంచి హస్తిన వరకు లిక్కర్ సామ్రాజ్యాన్ని విస్తరించారు
– టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్

ఢిల్లీ లిక్కర్ స్కాంకు విజయసాయిరెడ్డి కుటుంబానికి దగ్గర సంబంధాలున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

విజయసాయిరెడ్డి తన అల్లుడిని బినామీగా పెట్టుకుని ఏపీలో కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నాడు. అదాన్ డిస్టిలరీస్ కు సంబంధించిన ఒక్క అడ్రస్ లో కూడా డిస్టిలరీ కంపెనీ లేదు. దొంగతనంగా వేర్వేరు డిస్టిలరీల్లో విజయసాయిరెడ్డి తనకు లాభాలు చేకూర్చే కల్తీ మద్యాన్ని తయారు చేయించి అదాన్ డిస్టిలరీస్ పేరుతో ఏపీలో మద్యం వ్యాపారాన్ని చేస్తున్నాడు. ఈ వ్యాపారం ద్వారా ఇప్పటి వరకు రూ.5వేలు కోట్లకు పైబడి టర్నోవర్ చేశారు. వీటిలోని కూ.2వేల కోట్లను ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ లో ఈఎండీ(ఎర్నస్ట్ మనీ డిపాజిట్) లుగా కట్టారని సీబీఐ తేల్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏ5గా ఉన్న ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. క్విడ్ ప్రోకో 1లో జగతి పబ్లికేషన్స్ కి ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కోట్ల రూపాయలు మళ్లించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైఎస్ భారతికి సంబంధాలున్నాయని సీబీఐ తన విచారణలో తేల్చింది. అంతేగాకుండా జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న కంపెనీల్లో ట్రైడెంట్ కంపెనీ ఒకటి. అంటే మొత్తంగా ఈ ఢిల్లీ కుంభకోణం మొత్తం జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతోంది.

2019 ఎన్నికలలో విజన్ కలిగినవ్యక్తి చంద్రాబు నాయడు. అటువంటి విజన్ కలిగిన వ్యక్తిని కాదని విషం లాంటి జగన్ రెడ్డిని నమ్మి ప్రజలు అతనికి 151 సీట్లతో పట్టం కట్టారు. మూడున్నరేళ్ల జగన్ పాలనలో దోపిడి, దౌర్జన్యాలు తప్ప మరొక ఎజెండా లేదు. ఏ కార్యక్రమం చేపట్టినా దానికో రహస్య ఎజెండా ఉంటుంది.

సంపూర్ణ మధ్యపాన నిషేధం అని చెప్పి ప్రజలను, ఆడపడచుల్ని నమ్మించాడు. అధికారంలోకి వచ్చిన తరువాత మధ్యపానాన్ని ఆయుధంగా చేసుకొని తన సొంత డిస్లరీ ద్వారా సొంత వ్యాపారంగా మద్యాన్ని చేసుకుంటున్నాడు. అప్పటి వరకు ఉన్న నేషనల్, ఇంటర్ నేషనల్ బ్రాండ్లని తొలగించి కల్తీ చెత్త మద్యాన్ని ప్రజలకు అందించి 5వేల మంది ప్రాణాలను బలిగొన్నారు. జగన్ రెడ్డి ఇంటికి దొడ్డి దారిన దాదాపు మూడేళ్లలో 15వేల కోట్లు చేరాయి. ప్రజలని పీడిస్తూ, వాళ్ల రక్తాన్ని జుర్రుకుంటూ వేల కోట్లు సంపాదించుకొని ఎన్నికలలో ఖర్చు పెట్టి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నారు. ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పడానికి టీడీపీ సమాయత్తం అవుతుంది.

నేడు వైజాగ్ లో 16వేల కోట్లతో పరిశ్రమ తెచ్చానని చెప్పి ప్లాస్టిక్ నిషేధం చేస్తున్నానని చెబుతున్నారు. దమ్ముంటే మద్యపానాన్ని నిషేధించాలని జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. దాదాపు రూ.2000ల మద్యం బాటిల్ కూడ ప్లాస్టిక్ బాటిల్ లోనే విక్రయిస్తున్నారు. మద్యం దుకాణాలలో ఇస్తున్న గ్లాసులు, సోడా బాటిల్ ప్లాస్టిక్ ఎలా నిషేధిస్తారు. కేవలం 16వేల కోట్లు కాజేయడానికి ప్లాస్టిక్ నిషేధం అని మరో అబద్ధం చెబుతున్నారు.

టీడీపీ బట్టబయలు చేసిన లిక్కర్ స్కాంకి దమ్ముంటే వైసీపీ నేతలు, ముఖ్యమంత్రి స్పందించాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అతని సతీమణి వై.యస్. భారతి, విజయ సాయి రెడ్డి, వారి బంధువులకు ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలున్నాయని ఆధారాలతో సహా బయట పెడితే ఎందుకు స్పందించడం లేదు. పౌరుషం లేదా? మాకు రోషం ఉంది, మగాడ్ని అని కోతలు కోస్తూ కేరాఫ్ తాడేపల్లి ప్యాలెస్ అని చెప్పుకుంటారుగా జగన్ రెడ్డి. దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎక్వైరీ వేయించండి.
5కోట్ల మందిని పరిపాలిస్తున్నాను, ప్రజలని ఉద్దరిస్తున్న అని మాయ మాటలు చెబుతున్న జగన్ రెడ్డి అతని మీద, అతని కుటుంబం మీద వచ్చిన ఆరోపణలపై ఎందుకు మాట్లాడటం లేదు.

మీ మీద ఉన్న అభియోగాలని ఎదుర్కోలేక, నిరూపించుకోలేక చంద్రబాబు నాయుడు కుప్పం వెళితే, లోకేష్ పలాస వెళితే అడ్డుకుంటున్నారు. అల్లర్లు సృష్టిస్తున్నారు. జగన్ రెడ్డి, ప్రభుత్వం చేసిన తప్పులను, కుంభకోణాలను వెలికితీసి ప్రజల ముందు పెట్టిన ప్రతిసారి వాటిని డైవర్ట్ చేస్తున్నారు. వాటి కోసం అల్లర్లకు పాల్పడం, దాడులు చేయించడం లాంటివి చేస్తున్నారు. దీనికి పోలీసులను ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. 10వేల కోట్ల లేపాక్షి భూములని కొట్టేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి సతీమణి భారతికి ఉన్న సంబంధాన్ని ప్రశ్నిస్తున్న విషయాన్ని దారి మళ్లించడం కోసం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు. మీ దౌర్జన్య కాండకు సమాధి కట్టే సమయం దగ్గరలోనే ఉంది. పోలీసులు లేకుండా జగన్ రెడ్డి వచ్చి మాతో తలపడ గలడా? అని సవాల్ విసిరారు. జగన్ రెడ్డికి కొమ్ముకాస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలిసులైన పర్వాలేదు వైసీపీ కండువాలు కప్పుకొని మమ్మల్ని ఎదుర్కోడానికి రండి. ప్రజాస్వామ్య బద్ధంగా పోలీసు యూనిఫామ్ కు గౌరవం ఇస్తున్నాముగానీ పోలీసులకు భయపడి కాదు.

పోలీసులతో పరిపాలన సాగించలాంటే నిజాం నవాబ్ కూడ పోలిస్ వ్యవస్ధ ఉండి ప్రజా ఉద్యమానికి తలొగ్గి పారిపోయిన చరిత్ర తెలుసుకోవాలి. పిల్లలు, మహిళలు కారం కళ్లలో కొట్లి రాళ్ళు ఒడిసి పట్టి కొడితే నిజాం నవాబు, అతని పోలీసు వ్యవస్ధ తోక ముడిచి పారిపోయారు. పోలిసులను అడ్డుపెట్టుకొని, పరదాలు, బారికేట్ల చాటున దాక్కొని, తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రిస్తూ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ, దోపిడి చేస్తూ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు.

బెండపూడి పిల్లలతో ఆంగ్లంలో మాట్లాడించారు నిజంగా వారికి ఆంగ్లం వచ్చి మాట్లాడారా? బెండపూడి ఆంగ్లం, ఒంగోలులో వెంకాయమ్మ పాడిన పాట, ఎంపీ గోరంట్ల మాధవ్ చూపించిన న్యూడ్ వీడియో కాల్, అరగంటకు రమ్మన్న అవంతి మాటలు, గంటకు రమ్మన్న అంబటి రాబాంబు మాటలు, క్యాసినో ఆడే కొడాలి నాని, పేకాట ఆడుకునే పేర్ని నాని, సారా అమ్ముకొనే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్సా సత్యనారాయణ, మాగంటి శ్రీనివాసులు వీళ్ళే కదా జగన్ రెడ్డి అక్రమ భాగస్వాములు. 151 మంది నాయకులలో ఒక్కడైనా నేర చరిత్ర లేని వాడున్నాడా? రౌడీలని, రేపిస్టులని అసెంబ్లీలో కూర్చోబెట్టారు. అందిన కాడికి దోచుకోవడానికి రాష్ట్రం నీతాత సొమ్ము కాదు. రానున్న ఎన్నికలలో నీ దొపిడీకి టీడీపీ చరమగీతం పాడబోతుంది .

తెలుగుదేశం పార్టీ ప్రజలలోకి వెళుతుంది, మీరు చేసిన తప్పులను ప్రజలలో పెడతాం, ప్రజా కోర్టులో ఛార్జ్ షీటుగా పెట్టి జగన్ రెడ్డిని చిత్తు, చిత్తుగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఉద్యోగాలు లేక చనిపోయిన యువకులు, మానభంగాలకు ఆహుతైన మహిళలు, అనేక ప్రాంతాలలో వైసీపీ అల్లర్లకు, దౌర్జన్యాలకు అల్లకల్లోలం అయిపోయింది రాష్ట్రం. చట్టం, న్యాయం అనేవి రాష్ట్రంలో మచ్చుకైన కనిపించనిచ్చారా? రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అనేది కనపడకుండా చేశారు. ఉక్రెయిన్ లో అయినా బతకొచ్చుకాని, ఆంధ్రాలో బతకలేం అనే పరిస్ధితిని తెచ్చారు. కోర్టులను ఏం చేయలేక వదిలేశారు. ఆర్డిఓ కార్యాలయాలను అమ్ముకున్నారు. తాగుబోతుల తల తాకట్టు పెట్టారు. డ్వాక్రా మహిళల పొదుపు సంఘాల మీద అప్పులు తీసుకొచ్చారు. ఆంధ్రా అంతా నీ దొపిడీతో అతలాకుతలం అయిపోయింది. ప్రజలు జరుగుతున్న పరిణామాలన్నింటిని గమనించి వైసీపీకి శాశ్వత సమాధి కట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని తీసుకురావాలి. రాక్షస పాలనను అంతమొందించకపోతే రాష్ట్రంలో బతికి బట్టకట్టలేని పరిస్ధితి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, పక్క రాష్ట్రాలతో పోడి పడి ఆర్ధికంగా ముందుకు సాగగలుగుతామని టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్ వివరించారు.

LEAVE A RESPONSE