Suryaa.co.in

Andhra Pradesh

భాష, సంస్కృతి-సంస్కారం గురించి మాట్లాడే అర్హత విజయసాయిరెడ్డికి లేదు

– ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్
భాష, సంస్కృతి-సంస్కారం గురించి మాట్లాడే అర్హత విజయసాయిరెడ్డికి లేదని. ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేఖరులకు విడుదల చేసిన వీడియోలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం…! పెద్దలంటే గౌరవం తప్ప ఇతరులను ఇబ్బందులు పెట్టే మనస్తత్వం కాదు. అవినీతికి పాల్పడే సంస్కృతి తెలుగుదేశానికి లేదు. దొంగ డిగ్రీలు, దొంగ కంపెనీల గురించి విజయసాయికే తెలుసు. లోకేశ్ కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక విజయసాయి అవకాకులు, చవాకులు పేలుస్తున్నాడు. సభ్యత, సంస్కారం గురించి విజయసాయి నేర్చుకోవాలిగానీ లోకేశ్ కాదు. విజయసాయిరెడ్డి లోకేశ్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. విజయసాయి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. భాష, సంస్కారం ఆటవిక భాష అనే మాటలు విజయసాయిరెడ్డి నోటి వెంట వస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. భాష గురించి, నాగరికత గురించి మాట్లాడే నైతిక హక్కు విజయసాయిరెడ్డికిగాని వైసీపీ నాయకులకుగానీ లేదు. దొంగ డిగ్రీలు, దొంక కంపెనీలతో డబ్బులు తరలించడం, అవినీతికి పాల్పడటం విజయసాయికే తెలుసు. ఈ సంస్కృతి తెలుగుదేశానికిగానీ, చంద్రబాబునాయుడు కుటుంబానికిగానీ లేదు. విద్యార్థుల పరామార్శ పర్యటనని, కుప్పంలో ప్రచారానికి లభిస్తున్న స్పందన చూసి ఓర్చుకోలేక అనుచిత వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ సభ్యత గురించి సాయిరెడ్డి మాట్లాడుతుంటే సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. లోకేశ్ ఏనాడు జగన్ లా బాబాయిని కొట్టలేదు. బాబాయి అంటే గౌరవం, అభిమానం. జగన్ లా మాత్రం కాదని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఈ వీడియోలో పేర్కొన్నారు.

LEAVE A RESPONSE