Suryaa.co.in

Telangana

ఒకనాటి రజాకార్లను ఉసిగొల్పిన కాశింరిజ్వీలా వ్యవహరిస్తున్రు:విజయశాంతి

తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అధికార పార్టీ తరఫు ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు ప్రజల పాలిట రాక్షసుల్లా తయారయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ గ్యాప్ లేకుండా పీడిస్తున్నరు. కబ్జాలు, దందాలు, మహిళలపై వేధింపులు, మానభంగాలు, హత్యలు, ఆత్మహత్యలు… ఒకటేంటి ఎన్నో రకాలుగా సాగుతున్న అరాచకాలు మీడియాలో, సోషల్ మీడియాలో సాక్ష్యాలతో సహా బయటపడుతున్నాయి. సీఎం కేసీఆర్ తీరు చూస్తుంటే వీళ్లని ఆయనే వెనకుండి నడిపిస్తూ…ఒకనాటి రజాకార్లను ఉసిగొల్పిన కాశింరిజ్వీలా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.

LEAVE A RESPONSE