– బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో సుజనాచౌదరి
సుజనా మంత్రి కావటం ఖాయం
– బీజేపీ ఏపీ ఇన్చార్జి సిద్దార్థనాథ్ సింగ్ జోస్యం
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గం గా తీర్చి దిద్ది అభివృద్ది దిశలో తీసుకెళ్తానని సుజన చౌదరి పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గ బీజీపీ విస్తృత స్థాయి సమావేశం భవానీ పురం లోని కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ బీజీపీ అభ్యర్థి వై.సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలోని ముఖ్య సమస్యలు గుర్తిస్తున్నామ ని, త్వరలోనే మానిఫెస్టో రూపొందిస్తామనీ తెలిపారు.
నియోజకవర్గంలో రోడ్లను విస్తరించడంతో పాటు విద్యుత్ లైన్లను అండర్ గ్రౌండ్ కెబ్లింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యర్థి పార్టీల పై విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అభివృద్ది మంత్రమే ధ్యేయంగా ముందుకు సాగుతామని చెప్పారు. అయోధ్య రామాలయం తరహాలో ఇంద్రకీలాద్రి నీ అభివృద్ది పరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సామ్యంలో కుల ప్రాతిపదికన కాకుండా, పార్టీ ఆదేశాల మేరకే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు . ఏపీ లో ఈ ఐదేళ్ళ పాలన పీడ కల లాంటిది కాబట్టి, కష్టాలనుంచి గట్టెక్కాలంటే కూటమి ని గెలిపించాలని పిలుపు నిచ్చారు. నేను పుట్టింది కంచికచర్ల అయినా నా సొంత ఇల్లు విజయవాడలోనే ఉంది.. నేను ఇక్కడే ఉంటాను ప్రజలకు అందుబాటులో ఉంటాను అని హామీ ఇచ్చారు.
బీజీపీ ఏపీ ఇంచార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీ లో ప్రధాని గా మోడీ, ఏపీ లో సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని తెలిపారు.. రాబోయే కాలంలో సుజనా చౌదరి రాష్ట్ర కేబినెట్ లో మంత్రి అవుతారని తెలిపారు. మరోసారి ఏపీ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు జరగటం తథ్యమని జోస్యం చెప్పారు . త్రివేణి సంగమం మాదిరిగా మూడు పార్టీల కేడర్ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణ రాజు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డ్డూరి శ్రీరామ్, పార్లమెంట్ ఇంచార్జీ సుబ్బయ్య , రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ, క్లస్టర్ ఇంచార్జీ శ్రీనివాస రాజు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు..