Suryaa.co.in

Andhra Pradesh

కాపులు అప్రమత్తంగా ఉండాలి

మంగళగిరిలో నన్ను ఓడించేందుకు 300 కోట్లు పంపారు
కొలనుకొండ రచ్చబండ సభలో యువనేత నారా లోకేష్

తాడేపల్లిః కులమతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్ అండ్ కో ప్రయత్నిస్తున్నారని, వారి కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండ రచ్చబండ సభలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో కాపులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేయడంతో 5శాతం రిజర్వేషన్లను చంద్రబాబు కల్పిస్తే, జగన్ వచ్చిన తర్వాత రద్దు చేశారు. కాపుల పేరుతో ఇప్పటివరకు ముసుగు రాజకీయం చేసిన కొందరు పెద్దలు ఇప్పుడు ముసుగు తొలగించి ఇప్పుడు వైసిపిలో చేరారు.

నన్ను మంగళగిరిలో ఓడించేందుకు ఇసుక, మద్యంలో సంపాదించిన అవినీతి డబ్బు రూ.300 కోట్లు పంపారు. మీ డబ్బుకు మంగళగిరి ప్రజలు లొంగరని లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా కొలనుకొండ వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచి మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకోవాలి. కోతలు లేకుండా సంక్షేమం అందించాలి. అమరారెడ్డి కాలనీలో ఇళ్లు పీకేసిన నిరాశ్రయులకు ఇళ్లపట్టాలతోపాటు పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలకు స్టడీ సెంటర్లు ఏర్పాటుచేయాలని కోరారు.

డ్రైనేజీ, చెత్త సమస్యను పరిష్కరించాలి. వడ్డేశ్వరం వద్ద బ్రిడ్జి నిర్మించాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. నారా లోకేష్ స్పందిస్తూ… అమరారెడ్డి కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలతో పాటు నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి ఇంటికి తాగునీరు, సీసీ రోడ్లు నిర్మిస్తాం. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తాం. వడ్డేశ్వరం వద్ద కొత్త బ్రిడ్జిలు నిర్మిస్తాం. పరిశ్రమలు తీసుకువచ్చి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.

 

LEAVE A RESPONSE