-ముఖ్య అతిథిగా పాల్గొనున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
-గోడపత్రికలను ఆవిష్కరించిన లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు
-కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వినతి
టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదిన అమరావతి హైకోర్టు దగ్గర ద్వితీయ వార్షిక రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు వెల్లడించారు. 23-01-2024 తేది ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించే ఈ రక్తధాన శిబిరానికి సంబంధించిన గోడ పత్రికలను టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు, లీగల్ సెల్ సభ్యులతో కలిసి శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పోసాని వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. సామాజిక బాధ్యతగా న్యాయవాదులు ఎన్టీఆర్ ట్రస్ట్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, న్యాయవాదులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు. గోడ పత్రికను ఆవిష్కరించిన వారిలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.