Suryaa.co.in

Andhra Pradesh

గొంతెండుతోంది.. గుక్కెడు నీళ్లివ్వండి సారూ..

– వేడుకుంటున్న గొల్లపల్లి ఎస్సీ పాలెం గ్రామస్తులు
( షేక్ షఫీ )

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లో గొల్లపల్లి ఎస్సీ పాలెం లో గత నెల నుండి నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో స్థానికంగా ఉన్న మంత్రి సురేష్ దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారానికి దారి చూపలేదు. స్థానిక సర్పంచి ఓబుల్ రెడ్డి తిరుమలయ్య మరియు పంచాయతీ కార్యదర్శి నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైంది . ఇప్పటికైనా స్థానిక అధికారులు, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, జిల్లా అధికారులైన స్పందించి తనకు నీళ్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు.

LEAVE A RESPONSE