కర్ణాటకలో 142 కరోనా కేసులు

-కర్ణాటకలో 10 కేసులు .. ఒకరు మృతి
-దేశంలో ఇప్పటి వరకు 5,33,318 మంది మృతి
-మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,749
-ఒక్క కేరళలోనే తాజాగా 115 కేసులు నమోదు

న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. నిన్న కేరళలో ఐదుగురు, యూపీలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది.

కరోనా కారణంగా ఇప్పటి వరకు 5,33,318 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నుంచి 4.44 కోట్ల మంది రికవరీ కాగా, రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది.. ఒక్క కేరళలోనే తాజాగా 115 కేసులు నమోదు అయ్యాయని, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,749కి చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ పొరుగు రాష్ట్రం కర్ణాటకలో 10 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. దేశంలో సోమవారం కొత్తగా 260 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.

Leave a Reply