Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీని వీడుతున్న గ్రామాలు

-సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరికలు

సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి కాకాణిపై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో పెద్దఎత్తున టీడీపీ కండువాలు కప్పుకుంటున్నారు. శుక్రవారం మనుబోలు మండలం చెరుకుముడి నుంచి 15 కుటుంబాల వారు నెల్లూరు వేదాయపాళెం సోమిరెడ్డి క్యాంపు కార్యాలయంలో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. చేరిన వారిలో మోడి కోటయ్య, కూరపాటి సుబ్రహ్మణ్యం, తురకా శ్రీనివాసులు, సజ్జనపు సిద్ధయ్య, బొడ్డు పురుషోత్తం, తురకా శీనయ్య, కూరపాటి శీనయ్య, శేషయ్య, నాసిన యశ్వంత్‌, కూరపాటి నాని, బొడ్డు వెంకటేష్‌, బొలిగర్ల వెంకటేష్‌, ఆస్తోటి మధు, తురకా బుజ్జయ్య, తురకా గురవయ్య తదితరులు ఉన్నారు.

వెంకటాచలం మండలం నుంచి చేరిక
వెంకటాచలం మండలం తిక్కవరప్పాడు పంచాయతీకి చెందిన 13 కుటుంబాల వారు నెల్లూరు వేదాయపాళెం కార్యాలయం ఆవరణలో శుక్రవా రం సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. చేరిన వారిలో పట్టపు సుబ్రహ్మ ణ్యం, వెందోటి శీనయ్య, పట్టపు రవీంద్ర, నలగర్ల రాజయ్య, వెంకేశ్వర్లు, దార్ల హరి, పెద్ది విష్ణు, తాటిపర్తి వెంకటయ్య, గోసి అర్జున్‌, పెద్ది ఏడుకొండ లు, మణి, నారాయణ, గెర్రి వెంకయ్య తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE