-ఆర్నెళ్ళలో ఒక్క గుజరాత్ రాష్ట్రానికే రూ. 80 వేల కోట్ల దేశ సంపద తరలింపు
-ఇదేనా..? కోపరేటివ్ ఫెడరలిజం
-దేశం అంటే ఒక్క గుజరాత్ రాష్ట్రమేనా..?
-మిగతా రాష్ట్రాలను ఎందుకు పట్టించుకోరూ..?
-కేంద్ర ప్రభుత్వ సహాయం, సహకారం లేకపోయినా… తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దూసుకెళ్తోంది
-ఇదీ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాధించిన ఘనత
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
ఆరు నెలల కాలంలో సుమారు రూ. 80,000 కోట్ల దేశ సంపదను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్క గుజరాత్ రాష్ట్రానికే తరలించారని, ప్రధాని మోడీ విధానాలు కోపరెటివ్ ఫెడరలిజం స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
భారతదేశం అంటే ఒక్క గుజరాత్ రాష్ట్రమే అన్న విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు వంటిదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.మోడీ జీ..! ఇదేం దుర్నీతి. ఇదే నా మీ కోపరేటివ్ ఫెడరలిజం నీతి..? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే.. కేవలం ఒక్క గుజరాత్ రాష్ట్రానికే వేలాది కోట్ల రూపాయలు తరలించడం ఎంత వరకు సమంజసం అని వినోద్ కుమార్ ప్రధాని మోడీని సూటిగా ప్రశ్నించారు. వచ్చే డిసెంబర్ నెలలో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దేశ సంపదను ఒక్క గుజరాత్ రాష్ట్రానికే తరలించడం ఎంత వరకు సబబు అని వినోద్ కుమార్ అన్నారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసే విషయం గురించి ప్రధాని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాలను పూర్తిగా విస్మరిస్తోందని, అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. కేవలం ఓట్లు, సీట్లు అన్న రాజకీయాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం అమలు చేస్తోందని, అందుకే ఓట్లు, సీట్లు ఉన్న గుజరాత్ రాష్ట్రంలో నిధుల వరదను పారిస్తోందని వినోద్ కుమార్ విమర్శించారు. ఇతర రాష్ట్రాలలో ఓట్లు, సీట్లు అవకాశం బీజేపీకి లేనందున .. ఇతర రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని వినోద్ కుమార్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినప్పటికీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఇవ్వకపోయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో స్వశక్తితో ముందుకు దూసుకుని వెళుతోందని వినోద్ కుమార్ తెలిపారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని వినోద్ కుమార్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా.. ఇతరత్రా సహకారం అందించకున్నా.. స్వశక్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకుని వెళ్తున్నదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం స్వశక్తితో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకుని దేశానికే గర్వకారణంగా మారిందని, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జోరుగా సాగిస్తోందని వినోద్ కుమార్ వివరించారు. అనేక ప్రాజెక్టుల నిర్మాణం పనులు పూర్తి చేసిందని అన్నారు.రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటు చేసుకున్నామని, గ్రామాలలో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వినోద్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దూర దృష్టి, లోతైన విశ్లేషణలతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి అని, కేంద్ర ప్రభుత్వం అవార్డులు రివార్డులు కూడా అందాయని వినోద్ కుమార్ వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా మంజూరు చేసిన మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలలో ఒక్కటీ అంటే ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకుండా వివక్షత చూపిందని వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు