Suryaa.co.in

Telangana

శ్రీశైలం జెన్.కో. అండర్ గ్రౌండ్ హైడ్రో పవర్ హౌస్ ను సందర్శించిన వినోద్ కుమార్

శ్రీశైలంలోని జెన్.కో. అండర్ గ్రౌండ్ పవర్ హౌస్ హైడ్రో పవర్ స్టేషన్ ను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా జెన్.కో. ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించారు. హైడ్రో పవర్ స్టేషన్ పనితీరు గురించి వినోద్ కుమార్ కు శ్రీశైలం పవర్ హౌస్ చీఫ్ ఇంజనీర్ రామసుబ్బారెడ్డి వివరించారు.కొంత కాలం కిందట జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటన తరువాత శ్రీశైలం పవర్ హౌస్ లోని మొత్తం ఆరు యూనిట్లలోని ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సాగుతోందని, త్వరలోనే ఆరవ యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని చీఫ్ ఇంజనీర్ రామసుబ్బా రెడ్డి వివరించారు. శ్రీశైలం జెన్.కో పవర్ హౌస్ హైడ్రో పవర్ స్టేషన్ పనితీరు పట్ల వినోద్ కుమార్ సంతృప్తిని వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE