రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ: ఉక్కు ఉత్పత్తి, అమ్మకం, టర్నోవర్లలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2021-22లో 28,214 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ సాధించింది. 2020-21లో సాధించిన టర్నోవర్తో పోలిస్తే 57 శాతం వృద్ధి సాధించిందని ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2017-18లో 16,618 కోట్ల వార్షిక టర్నోవర్ నమోదు చేసిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) 2021-22లో 28,214 కోట్ల టర్నోవర్ సాధించిందని తెలిపారు.