Suryaa.co.in

Andhra Pradesh

‘ఫార్మా ‘ పెట్టుబడులకు విశాఖ గమ్యస్థానం

– ఫార్మా ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి
– రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్

విశాఖపట్నం, జూలై 14: ఫార్మా కంపెనీల ఏర్పాటుకు విశాఖ సరైన ప్రదేశమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడ అమర్ నాథ్ అన్నాడు. జే.ఎన్. పి.సి. తయారీదారుల. అlసోసియేషన్ ఆధ్యర్యంలో పార్మా సిటీ లో గురువారం జరిగిన సమావేశానికి మంత్రి అమర్ నాధ్ ముఖ్య అతిధిగా హాజరయ్యురు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఐ.టి రంగంలో హైదరాబాద్ గణనియమైన అభివృద్ధి సాధించిందని, ఐ.టి. పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.

అయితే ఫార్మా రంగంలో పెట్టుబడులకు విశాఖలో మంచి అవకాశాలు ఉండటంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సౌకర్యాల కల్పనకు సిద్ధంగా ఉందని మంత్రి అమర్ నాథ్ పేర్కొన్నారు. ఫార్మా కంపెనీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్నారు. కంపెనీ యాజ మాన్యాలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంచే వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేoదుకు చర్యలు తీసుకుంటే మని మంత్రి అమర్ నాధ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు వారికున్న సమస్యలను తెలపాలని సుమారు 900 మంది పారిశ్రామిక వేత్తలకు లేఖలు రాశానని, అయితే ఫార్మా కంపెనీ యాజమాన్యాలు ఎటువంటి సమస్యలను తన దృష్టికి తీసుకురాలేదని మంత్రి అమర్ నాథ్ చెప్పారు. ఫార్మా ఇండస్ట్రీ అధినేతలు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు విశాఖ ఫార్మాసిటీలో ఉన్న సౌలభ్యంల గురించి వివరించి, తద్వారా మరిన్ని కంపెనీలు విశాఖకు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తరచూ చెపుతున్నార ని మంత్రి అమర్ నాథ్ తెలిపారు. అందుకు తగ్గట్టుగా ఫార్మా దిగ్గజాలు. స్పందించాలని ఆయన కోరారు. రాష్ట్రoలో చిన్న, పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అయిన చెప్పారు. ఫార్మా కంపెనీలలో స్థానిక యువతకు అధిక ప్రాధా న్యత కల్పించాలని మంత్రి అమర్ నాథ్ సూచించారు.

అనకాపల్లి, ఎం.పి. సత్యవతమ్మ మాట్లాడుతూ విశాఖ ఫార్మా కంపెనీల నుంచి అత్యుత్తమ ఔషధాలు తయారు కావాలని, విదేశాలకు ఎగుమతయ్యేలా చూడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల డి.ఇ.ఎస్.హెచ్. పేరులో ఒక పథకాన్ని ప్రవేశ పెట్టింది అని దీనివలన ఎక్కడి ఉత్పత్తులను అక్కడే విక్రయించు కోవచ్చని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కంపెనీలలో 70 శాతం మంది స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డి విడుదల చేసిన నూతన పారిశ్రామిక విధానంలో సూచించారని సత్యవతమ్మ చెప్పారు. తమ పరిశ్రమల్లో కావల్సిన స్థానికులకు స్కిల్ లేదని వారిని పక్కన పెట్టకుండా, స్కిల్ సెంటర్లలో వారికి శిక్షణ ఇప్పించి, వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఎం.పి కోరారు.

పెందుర్తి ఎమ్మెల్యే అదీ పురాజు మాట్లాడుతూ అందరి కష్ట, నష్టాలు తెలిసిన వ్యక్తి పరిశ్రమల శాఖామంత్రిగా రావడం మన అదృష్టం అని అన్నారు. తాము అధి కారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలలో, పార్మా కంపెనీలను రాజకీయంగా వేధించలేదని ఉన్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో యాజమాన్యాలు ఉదారంగా వ్యవహరించాలని అన్నారు..
ఈ సమావేశంలో జడ్పీ టి.సి పి.ఎస్.ఎన్. రాజు, ఎం.పి.పి. పైల శ్రీనివాసరావు ప్రసంగించారు. అలాగే ఎం. ఎస్. ఎం.ఈ. డైరెక్ట్న నదియా, ఫార్మా కంపెనీల అధినేతలు రామేశ్వరరావు, విశాఖ ఫార్మా సిటీ ఎం.డి. లాల్ కృష్ణ కార్పొరేటర్ ఇళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE