-వివేకాహత్య తాలూకా వాస్తవాల దర్పణం ‘జగనాసుర రక్తచరిత్ర’ పుస్తకం
-వివేకాహత్యతో ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డిపై, వైసీపీపై కేంద్రఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
-టీడీపీ జాతీయ కార్యాలయంలో ‘జగనాసుర రక్తచరిత్ర’ (బహిరంగం) పుస్తకావిష్కరణ
-పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
-కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నక్కా ఆనంద్ బాబు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్డర్. చనిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్. ఆయన తండ్రికి సొంత తమ్ముడు. అలాంటి వ్యక్తిని ఎవరు చంపారు, ఏ ప్రోద్భలంతో చేశారు, ఏ ఆశించి చేశారు, ఆనవాళ్లు లేకుండా ఆహత్యను ఇతరులపైకి ఎలా నెట్టారనే పూర్తి వివరాలతో తెలుగుదేశం పార్టీ ‘జగనాసుర రక్తచరిత్ర’ (బహిరంగం) పేరుతో పుస్తకాన్ని ముద్రించింది.రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ‘జగనాసుర రక్తచరిత్ర’ (బహిరంగం) పుస్తకం చేరాలి. అప్పుడే ప్రజలకు నిజాలు, హత్యకు పాల్పడిన దోషుల వివరాలు తెలుస్తాయి. పార్టీ తరుపున కేంద్రఎన్నికల కమిషన్ కు కూడా లేఖరాస్తున్నాం. 2019 ఎన్నికల్లో సొంత బాబాయ్ ని హత్యచేయించి, ఆ నేరాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుపై మోపి, జగన్ రెడ్డి లబ్దిపొందాడు కాబట్టి, వైసీపీని రద్దుచేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు లేఖరాయాలని నిర్ణయించుకున్నాం. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులపెట్టించి, దేశంలోనే నంబర్ 1గా నిలిపింది.
ఆ పరిస్థితుల్లో మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడన్న దురుద్దేశంతో, తన అధికారకాంక్షను నెరవేర్చుకోవడానికి అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దారుణాలకు పాల్పడ్డాడు.పాదయాత్రపేరుతో ఊరూవాడా తిరిగిన జగన్ రెడ్డి, చంద్రబాబుపై, టీడీపీనేతలపై అవాకులు చవాకులు పేలడమేగాక, అనరాని మాటలన్నాడు. ఎన్ని వేషాలేసినా, దూషణలు చేసినా ప్రజలు నమ్మకపోవడంతో విశాఖపట్నం విమానాశ్రయంలో కోడికత్తి డ్రామా ఆడాడు. పాచికకూడా పారకపోవడంతో చివరకు అధికారం తనకు దక్కదన్న నైరాశ్యంతో సొంత బాబాయ్ ని బలితీసుకోవడానికి తెగించాడు.వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య 2019లో జరిగింది. చాలా కిరాతకంగా, దారుణాతిదారుణంగా గొడ్డలివేటుతోవివేకానందరెడ్డి చంపబడ్డాడు.హత్యజరిగిన వెంటనే ఏ2 విజయసాయిరెడ్డి, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని మీడియాతో చెప్పాడు.ప్రజలంతా దానిపై చర్చించుకునేలా చేసి, తరువాత తీరుబడిగా హత్యతాలూకా ఆనవాళ్లు లేకుండా రూపుమాపారు.
సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా చేయడంలో ఎంపీ వై.ఎస్. అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రధానపాత్ర పోషించారు.ఏ2 విజయసాయి, అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వారిపనిలో వారుంటే, జగన్మోహన్ రెడ్డి తన అధికారకాంక్షతో బాబాయ్ హత్యను చంద్రబాబుపైకి, టీడీపీపైకి నెట్టాడు. ప్రజల ముందు అమాయకుడిలా నటిస్తూ మొసలికన్నీరు కార్చాడు. తన విషపుమీడియా ద్వారా కట్టుకథలు అల్లి ప్రజల్ని నమ్మించడంలో విజయవంతమయ్యాడు. 2019లో ముఖ్యమంత్రి అయ్యింది మొదలు జగన్మోహన్ రెడ్డి, వివేకాహత్యకేసు విచారణను అడ్డుకుంటూనే ఉన్నాడు.వివేకా హత్యకేసులో నిందితులైన దస్తగిరి అప్రూవర్ గా మారి, సీబీఐకి కొన్ని నిజాలు చెప్పాక, అసలు దోషులు ఒక్కొక్కరుగా బయటకువచ్చారు.ఇటీవలే ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారిస్తే, తాను హత్యజరిగిన రోజున ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతిలతో మాట్లాడినట్లు చెప్పాడు.
అవినాశ్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ పై ముఖ్యమంత్రి, ఆయన సతీమణి స్పందించలేదు. అవినాశ్ రెడ్డి ముఖ్యమంత్రి దంపతుల పేర్లుచెప్పాక, సీబీఐ వెంటనే వారిని విచారించాల్సింది. వివేకాను హత్యచేయడానికి రూ.40కోట్ల సుపారీ ఇచ్చారని సీబీఐ విచారణలో తేలింది. అంతసొమ్ము ఇచ్చేంత స్థాయి వై.ఎస్. అవినాశ్ రెడ్డికి లేదు. అవినాశ్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ లో తనకున్న ఆస్తిమొత్తం కేవలం రూ.18కోట్లేనని చెప్పాడు. ఈ విధంగా వివేకాహత్యకేసులో ఒకదానికొకటిగా కనెక్ట్ అయ్యిఉన్న అనేక ప్రశ్నలన్నింటికీ ప్రజలకు సమాధానం తెలియాలి.సీబీఐ త్వరగా కేసువిచారణ ముగించి, అసలు సూత్రధారులు, పాత్రధారుల్ని శిక్షించాలని కోరుతున్నాం. వీటన్నింటిని కూలంకషంగా వివరిస్తూ, వివేకా హత్యోదంతంపై ‘జగనాసుర రక్తచరిత్ర’ (బహిరంగం) పేరుతో పుస్తకాన్ని ముద్రించాము.పుస్తకంలో అనేక అంశాలగురించి లోతుగా విశ్లేషణచేయడం జరిగింది. ప్రజలంతా ఈ పుస్తకం చదివాలి…జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాం.”
అధికారం కోసం సొంతబాబాయ్ ని, సొంత కుటుంబాన్ని బలితీసుకున్న వ్యక్తి సైకో కాక ఏమవుతాడు? : టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
“వివేకానంద రెడ్డి హత్య రాష్ట్రప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వివేకాహత్యకేసులో సీబీఐ విచారణ మొదలయ్యాక నివ్వెరపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. వివేకానందరెడ్డిని చిత్రహింసలకు గురిచేసి, గొడ్డలిపోట్లు వేశాక, కొనఊపిరితో కొట్టుకుం టున్న ఆయనతో సంతకాలు తీసుకొని తప్పుడు డిక్లరేషన్ తయారుచేశారు. వివేకా నందరెడ్డి శవానికి జగన్ సతీమణి భారతిరెడ్డి తండ్రి ఆసుపత్రి నుంచి వచ్చిన కాంపౌండర్ తో కుట్లువేయించి, కట్లు కట్టించారు. వివేకాహత్య కేసు విచారణలో ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో హత్యజరిగిన రోజున తాను జగన్, ఆయన సతీమణి భారతిలతో మాట్లాడానని చెప్పాడు. జగన్ సొంతచెల్లెలు షర్మిల వివేకాహత్యకేసులో వాస్తవాలు బయటకు రాకుండా ఏపీప్రభుత్వం అడ్డుకుంటోంది అని చెప్పింది. జగన్ రెడ్డి పాలనలో వివేకాహత్యకేసు విచారణ సక్రమంగా జరగదని, కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీచేయాలని వివేకానందరెడ్డి కుమార్తె సునీత హైకోర్ట్ లో పిటిషన్ వేసింది. ఆమెవిజ్ఞప్తితోనే న్యాయస్థానం వివేకాహత్యకేసు విచారణను తెలంగా ణకు బదిలీచేసింది. జగన్ రెడ్డిని సొంతచెల్లెళ్లు, కన్నతల్లే నమ్మకపోతే, రాష్ట్రప్రజలు ఎలానమ్ముతారు? సొంతకుటుంబాన్ని కూడా అధికారం కోసం బలితీసుకునే ఇలాంటి వ్యక్తి సైకో కాక ఏమవుతాడు? అందుకే టీడీపీ సైకో పోవాలి – సైకిల్ రావాలి అంటుంది. వివేకాహత్యలో సాగిన నరమేథంపై ముఖ్యమంత్రి నోరువిప్పాల్సిందే.”
ఢిల్లీ వెళ్లినా, ప్రత్యేక విమానాల్లో పరుగులుపెట్టినా వివేకాహత్యకేసు నుంచి ముఖ్యమంత్రి దంపతులు తప్పించుకోలేరు : టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య
“వివేకానందరెడ్డి హత్య జగన్ అంత:పుర కుట్ర. 2019 ఎన్నికల్లో కడపఎంపీ సీటు తనకు కావాలని అవినాశ్ రెడ్డి బలవంతం చేసినప్పుడు, ఆ సీటు ఇస్తే తనకే ఇవ్వాల ని, లేదా షర్మిలకో, విజయమ్మకో ఇవ్వాలని దివంగత వివేకానందరెడ్డి, జగన్మోహన్ రెడ్డికి తెగేసి చెప్పాడు. వివేకా అలాచెప్పినప్పుడే ఆయన్ని చంపాలనే పెద్దకుట్ర జగన్ అంత:పురంలో జరిగింది. వివేకాహత్యకేసులో అంతా బహిరంగమైంది. ప్రతిఒక్కరికీ వాస్తవాలు తెలిశాయి. ఈ కేసులో ముఖ్యమంత్రి, ఆయన సతీమణి ఇంకా దాచాలని ప్రయత్నించడం అనవసరం. సీబీఐ విచారణలో అవినాశ్ రెడ్డి ‘మర్డర్ ఎలా జరిగింది.. మీరు చెప్పినట్టే చేశాం.. మనం అనుకున్నవిధంగా హత్యచేశాం.. ఇన్నిగొడ్డలిపోట్లు పడ్డాయి’ అనే వివరాలు ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి దంపతులకు తెలియచేసినట్లు తేలింది. అవన్నీ ప్రజలముందుకు వచ్చాక, ముఖ్యమంత్రి దంపతులకు తెలిసే వివేకానందరెడ్డి హత్యజరిగిందని ప్రజలకు అర్థమైంది. వారు సై అనకపోతే, వివేకానంద రెడ్డిని చంపే ధైర్యం ఎవరికి ఉంటుంది? ముఖ్యమంత్రి ఢిల్లీవెళ్లినా, ప్రత్యేకవిమానాల్లో పరుగులుపెట్టినా కేసు నుంచి తప్పించుకోలేరు. త్వరలోనే సీబీఐ గౌరవ ముఖ్యమంత్రి దంపతులకు కేసువిచారణ నిమిత్తం నోటీసులు జారీచేయనుంది.”
వివేకాహత్యకేసులో జగన్ రెడ్డే ప్రధానసూత్రధారి, పాత్రధారి : టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు నిమ్మల రామానాయుడు
“జగన్మోహన్ రెడ్డి సొంతబాబాయ్ హత్యతాలూకా వాస్తవాలన్నీ తాడేపల్లి రాజప్రాసాదంతో ముడిపడుతున్నాయి. ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతిక విలువలున్నా కూడా ఈ వ్యవహారంపై వెంటనే రాజీనామా చేయాలి. కడప ఎంపీ సీటుకోసం సొంత బాబాయ్ ని కర్కశంగా గొడ్డలిపోటుకి గురిచేయడం జగన్ రెడ్డి క్యారెక్టర్ కి నిదర్శనం. వివేకాహత్య కేసులో జగన్ రెడ్డే ప్రధానసూత్రధారి, పాత్రధారి. మృతదేహానికి కుట్లు వేయించడం మొదలు, హత్యజరిగిన నాడు ఘటనాస్థలానికి వచ్చిన సీఐ శంకరయ్య సస్పెన్షన్ ఎత్తేసి, తిరిగిఉద్యోగమిచ్చి ప్రమోషన్లు ఇవ్వడం, పులివెందులకోర్టులో సీబీఐ అధికారుల్ని అవినాశ్ రెడ్డి బెదిరించడం, హత్యకు రూ.40కోట్ల సుపారీ ఇవ్వడం, హత్యకేసులో నిందితులుగా ఉన్నవారికోసం కపిల్ సిబల్ లాంటి ప్రఖ్యాత న్యాయవాదు లు వాదించడం వంటివన్నీ హత్యకేసులో జగన్ ప్రమేయాన్ని రుజువు చేస్తున్నాయి. హత్యకేసు విచారణకు టీడీపీప్రభుత్వం నియమించిన సిట్ ను అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి నిర్వీర్యంచేశాడు. హత్యకేసులో ఏ1గా ఉన్న గంగిరెడ్డిపై రాష్ట్రపోలీసులు కేసు నమోదు చేయకపోవడంలో కూడా జగన్ పాత్ర ఉంది. ఏ4గా ఉన్న శివశంకర్ రెడ్డి కడప జైలు నుంచి కోర్టు అనుమతి లేకుండానే రిమ్స్ ఆసుపత్రికి వెళ్లడం ముఖ్యమంత్రి ఆదేశాలతో జరిగిందే. హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి రాష్ట్రంలో రక్షణలేని పరిస్థితి వచ్చిందంటే దానికి ముఖ్యమంత్రే కారణం. హత్య కేసులో ప్రధాన నిందితుడి గా ఉన్న అవినాశ్ రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి స్థానంలోఉన్న జగన్ రెడ్డి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. హత్యజరిగిన సమయం నుంచి తెల్లారేవరకు ఘటనాస్థలం నుంచి అవినాశ్ రెడ్డి, నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలకు ఫోన్లు చేసి, వారిద్వారా జగన్ రెడ్డి, ఆయన సతీమణితో మాట్లాడాడని తేలిపోయింది. ఇంతజరిగాక ముఖ్యమంత్రి ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూడటం వృథాప్రయాసే. చేసిన దారుణానికి జగన్ రెడ్డికి ప్రజాకోర్టులో శిక్షపడటం ఖాయం.”
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ రెడ్డి రక్తచరిత్ర కొనసాగుతుంది : టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి
“జగనాసుర విముక్త ఆంధ్రప్రదేశే ‘జగనాసుర రక్తచరిత్ర’ పుస్తక లక్ష్యం. కోడికత్తి డ్రామా మొదలు బాబాయ్ గొడ్డలిపోటు వరకు జరిగిన దారుణాలతో ఎట్టకేలకు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. బాబాయ్ హత్యకేసు విచారణ సీబీఐకి వెళ్లిననాడే జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సింది. వివేకాహత్యకేసు విచారిస్తున్న సీబీఐ అధికారులపై తప్పుడుకేసులు పెట్టినప్పుడే, ఈ వ్యవహారంలో ప్రధానవ్యక్తి ముఖ్యమం త్రేనని తేలిపోయింది. జగన్ రక్తచరిత్ర ఆయన తాత రాజారెడ్డి నుంచి వారసత్వంగా వచ్చింది. పరిటాల రవిహత్య మొదలు అనేక దారుణాలు జగన్ రక్తచరిత్రకు నిదర్శనా లు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండికూడా అదే రక్తచరిత్ర కొనసాగిస్తున్నాడు. దళిత యువకుణ్ణి వైసీపీఎమ్మెల్సీ చంపేసి, శవాన్ని డోర్ డెలివరీ చేస్తే, జగన్ రెడ్డి స్పందించ లేదు. రాష్ట్రంలో ప్రజలకు భావప్రకటనాస్వేచ్ఛ, ప్రతిపక్షాలకు ప్రజల్లోకి వెళ్లే హక్కు లేకుండా చేస్తున్నారు. ఆస్తులదోపిడీ, మానప్రాణాల దోపిడీపై, ఏపీ పోలీస్ వ్యవహరి స్తున్న తీరుపై కేంద్రహోంశాఖ ఎందుకు స్పందించదు? డీజీపీ ఆఫీసు ముట్టడిపేరుతో టీడీపీ కార్యాలయం చుట్టూ ముళ్లతీగలువేసి, పోలీసులు కాపలాకాయడం ఏమిటి?”
వివేకాహత్యకేసులో వాస్తవాలు బయటకొచ్చినా సిగ్గులేకుండా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికోసం వెంపర్లాడుతున్నాడు : టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు నక్కా ఆనంద్ బాబు
“రాష్ట్రంలో సంచలనం రేపిన ఘోరసంఘటన తాలూకా వాస్తవాలు ప్రజలకు చెప్పడా నికే టీడీపీ ‘జగనాసుర రక్తచరిత్ర’ పుస్తకం తీసుకొచ్చింది. మార్చి11న రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రాగానే, మార్చి15న వివేకానందరెడ్డి హత్యజరిగింది. 2, 3 నెలల ముందు వివేకా హత్యజరిగితే, టీడీపీప్రభుత్వమే 10రోజుల్లో వాస్తవాలు తేల్చి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి కుట్రలను తేల్చేసేది. ఎన్నికల షెడ్యూల్ వచ్చి, అధికారంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నా చంద్రబాబుగారు వివేకాహత్యపై సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. కానీ ప్రణాళికప్రకారం జగన్ రెడ్డి సిట్ దర్యాప్తు, విచారణాం శాలపై కోర్టును ఆశ్రయించి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. తరువాత సీబీఐ విచారణ కావాలంటూ జగన్ రెడ్డి కోర్టుకు వెళ్లాడు. ముఖ్యమంత్రైన వెంటనే వివేకాహత్యకేసు విచారణను నీరుగార్చే ప్రయత్నాలు ప్రారంభించాడు. హత్యజరిగిన వెంటనే జగన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి ప్రత్యేకవిమానంలో, హెలికాప్టర్లో పులివెందులకు రాకుండా, తీరుబడిగా రోడ్డుమార్గంలో సాయంత్రానికి చేరుకున్నాడు. మార్గంమధ్యలో హత్యను ఎలా తనకుఅనుకూలంగా మార్చుకోవాలో పథకరచన చేశాడు. చిన్నాన్నరక్తంతో ముఖ్యమంత్రిపీఠం దక్కించుకున్న జగన్ రెడ్డి, తన అధికారం మొత్తా న్ని హత్యకేసుని నీరుగార్చడానికే వినియోగించాడు. హత్యకేసులో అన్నివాస్తవాలు బయటకు వచ్చాక కూడా సిగ్గులేకుండా పదవికోసం వెంపర్లాడుతున్నాడు. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నాకూడా జగన్ రెడ్డి, వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి .”
ప్రతి తెలుగుమహిళ చదవాల్సిన పుస్తకం ‘జగనాసుర రక్తచరిత్ర’ : టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
“తల్లీకొడుకు, అన్నాచెల్లెళ్ల పవిత్రబంధానికి కళంకం తెచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి. జగన్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్లు ఏడ్చిఏడ్చి రాష్ట్రం వదిలిపోయారు. మరోచెల్లి సామాన్య మహిళ లా ఢిల్లీవీధుల్లో న్యాయంకోసం పరితపించింది. అన్న ముఖ్యమంత్రిస్థానంలో ఉంటే, తనతండ్రి హత్యకేసు విచారణ సక్రమంగాజరగదని వేరేరాష్ట్రానికి బదిలీ చేయించుకుం ది. వివేకామహత్యకేసువిచారణలో సునీతారెడ్డి వాంగ్మూలం, వై.ఎస్. షర్మిల ప్రకటన చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంతటి మహిళాకంటకుడో అర్థమవుతుంది. వివేకాను చంపినవారికి శిక్షపడటం కోసం సునీతారెడ్డి జగన్ రెడ్డిని ఎంతగా బతిమాలు కుందో, వైసీపీనేతల్ని ఎంతగా ప్రాధేయపడిందో ఆమె వాంగ్మూలం చెబుతోంది. సీబీఐ విచారణకు ఆదేశిస్తే జగన్ రాజకీయభవిష్యత్ ప్రమాదంలో పడుతుందని వైసీపీ సీనియర్ నేతలు తనతో అన్నారని సునీత సీబీఐ తో చెప్పారు. జగన్ సొంతచెల్లి షర్మిల కడపఎంపీ టిక్కెట్ కోసమే మాచిన్నాన్న హత్యజరిగిందని, వివేకాహత్య తమకుటుంబంలో జరిగిన ఘోరమని అభిప్రాయపడింది. ‘జగనాసుర రక్తచరిత్ర’ పుస్త కం వాస్తవాలకు ప్రతిబింబం. తెలుగురాష్ట్రాల్లోని ప్రతిమహిళా చదవాల్సిన పుస్తకం. రేపు జరగబోయే ఎన్నికల్లో ఒక్కమహిళఓటు జగన్మోహన్ రెడ్డికి పడినా, అది యావత్ మహిళాలోకానికే అవమానం.”