హిల్లరీ క్లింటన్. మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య “‘హార్డ్ చాయిస్’” అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో ఆమె ఒక ఆశ్చర్యకరమైన విషయం వెల్లడించారు.
ద్వితీయ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన కొన్ని వారాల తర్వాత, ఒక రష్యన్ సైనికుడు సెలవు కోసం ఇంటికి వెళ్తాడు. తన గ్రామానికి వచ్చిన ఆ సైనికుడు గ్రామంలో అడుగు పెట్టిన వెంటనే షాక్కు లోనవుతాడు.
ఆ గ్రామాన్ని శత్రువులు బాంబులతో ధ్వంసం చేశారు. సైనిక వాహనాలలో మృతదేహాలు మోపినట్టుగా ఉన్నాయి. వందలాది మృతదేహాలు అక్కడ పడ్డున్నాయి. వాటిని సామూహిక సమాధికి తీసుకెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సైనికుడు కొంతసేపు మృతదేహాల ముందు నిలబడి ఉన్నాడు.
ఒక మహిళ పాదాలలో ఉన్న షూస్ (పాదరక్షలు) తన భార్యకి నిన్న కొనిచ్చిన షూస్ లాగా ఉన్నాయ్ అనిపించింది. అతడు వెంటనే ఇంటికి పరుగెత్తాడు.
ఇంట్లో ఎవ్వరూ లేరు. వెంటనే తిరిగి వచ్చి ఆ మృతదేహాన్ని పరిశీలించాడు.
ఆమె తన భార్యే!
షాక్కు లోనైన అతను, తాను ఆమెను సామూహిక సమాధిలో పాతలేను. ప్రత్యేకంగా సమాధి వేయాలనుకుంటున్నాను అంటూ ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనుమతి కోరాడు. అనుమతి దక్కింది. అతడు చాలా కష్టంగా ఆమెను వాహనం నుండి బయటకు తీస్తున్న సమయంలో… అతనికి మరో షాక్! తన భార్య మృతురాలు కాదని, ఆమెకు ఇంకా ప్రాణాలు ఉన్నాయని తెలిసింది!
అతడు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు! అక్కడ తగిన చికిత్స అందించి… ఆమె ప్రాణాలతో తిరిగి బతికిపోయింది. ఈ ఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత… జీవితం నుంచి తప్పించుకున్న ఆ భార్యకు గర్భం వచ్చింది. ఒక బాబు జన్మించాడు. ఆ పుట్టిన శిశువును చూసినవారు అతనికి పేరు పెట్టారు.
ఆ పేరేంటో మీకు తెలుసా?
“వ్లాదిమిర్ పుటిన్”!
ఎక్కడైనా ఈ పేరును విన్నారా?
ఈ పేరే..
ఇప్పుడు రష్యా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. చనిపోయాల్సిన తల్లిలో, అదృష్టం వలన
ఓ దేవుడిలా గర్భంలో దిగి ఈ లోకంలో అవతరించిన వ్యక్తి, ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న శక్తులలో ఒకడు. ఈ సంఘటనను మనం విధిగా పరిగణించాలా? లేదా మరే పేరుతో పిలవాలి?
కామ్రేడ్ మృత్యుంజయులు