– పది ప్రశ్నలు సంధించిన వాలంటీర్లు
– సమాధానం చెప్పాలంటూ డిమాండ్
1. మహిళల అక్రమ రవాణా వాలంటీర్లు చేస్తున్నారా? ఇది నీ దత్తతండ్రి రాసిచ్చిన స్క్రిప్ట్ కాదని.. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.
2. ప్రతి నెల ఒకటో తారీకున.. ఠంచనుగా సూర్యుడు ఉదయించక ముందే అవ్వాతాతల చేతుల్లో ఇంటికి వెళ్లి మరీ పెన్షన్ ఇస్తుంది వాలంటీర్లు కాదా?..హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు..
3. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకు చేరుస్తున్న సారధులు వాలంటీర్లు కాదా? హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.
4 కరోనా సమయంలోను తమ ప్రాణ ప్రాణాలను పణంగా పెట్టి గడపగడపకు తిరిగి సేవలు అందించింది వాలంటీర్లు కాదా? హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.
5. కరోనాతో మరణించిన వారిని సైతం తాకడానికి అయిన వారే భయపడి వదిలేస్తే.. ఆ అనాధ శవాలకు దహన సంస్కారాలు చేసింది వాలంటీర్లు కాదా?.. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.
6 పెన్షన్లు, సంక్షేమ పథకాలే కాకుండా.. వరదలు లాంటి ప్రకృతి విపత్కర పరిస్థితుల్లోనూ వాలంటీర్లు సహాయం అందించలేదా?..హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.
7. ఏపీ వాలంటీర్ వ్యవస్థను కేరళనే కాకుండా బ్రిటన్ వంటి దేశాలు కూడా ఆదర్శంగా తీసుకున్న మాట వాస్తవం కాదా? హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.
8. స్వయంగా దేశ ప్రధాని ఏపీలో సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పనితీరు కూడా బాగుందని ప్రశంసించలేదా..? హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.
9. వేలాది మంది మహిళలు మీ దత్త తండ్రి పాలనలో మిస్సయిన మాట వాస్తవం కాదా? ఆ ప్రభుత్వంలో నువ్వు లేవా? హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.
10. వాలంటీర్లంటే నీకు వెన్నులో మనకు.. దత్త తండ్రికి భయం. అందుకే వలంటీర్లపై నిందలు మోపుతున్నావు కదా?.. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తినడం ఆపి నిజం చెప్పు.’
అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.