– శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ
ఒకే జాతి ఒకే దేశం ఒకే చట్టం అనే నినాదంతో జాతి ఐక్యతను పెంపొందించే విధంగా కామన్ సివిల్ కోడ్ చట్టాన్ని తయారు చేయాలని శైవ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి ఆకాంక్షించారు ఆయన ఈరోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యవేదిక విజయవాడ నగర శాఖ ఆధ్వర్యంలో బి ఆర్ టి ఎస్ రోడ్డు మీద జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పటి కేంద్ర ప్రభుత్వం పూనుకుందని ఒకే జాతి అన్న నినాదం ప్రపంచమంతా మారుమోగాలని ఆయన అన్నారు. షేక్ బాజీ గారు మాట్లాడుతూ అన్ని మతాలను సమానంగా చూసే విధంగా ఒకే చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో క్రైస్తవ మైనారిటీ నాయకులు ప్రభుదాస్ ఈ కార్యక్రమంలో జాతీయవాదులు నాగలింగం శివాజీ కృష్ణ భగవాన్ ఎస్సీ మోర్చా నాయకురాలు బొడ్డు నాగలక్ష్మి బాచిమంచి రవికుమార్ మరియు అనేక మంది హిందూ ముస్లిం క్రిస్టియన్లు పాల్గొన్నారు.