లీకువీరుడు నారాయణ అరెస్ట్ తో ఎగిరెగిరి పడుతున్న చంద్రబాబు

– అసని తుపానుపై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్
– రాష్ట్రంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ
– ప్రజారోగ్యానికి పెద్దపీట-2022-23 సంవత్సరానికి రూ.650 కోట్ల అదనపు నిధులు
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి

లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకున్న లీకు వీరుడు నారాయణను అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నాడని, పేపర్ల లీకును ‘సేవ’గా గుర్తించి పద్మశ్రీ ఇవ్వాలా బాబూ ఆంటూ చంద్రబాబుపై రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు.

ర్యాంకుల కోసం రేయింబవళ్లు నారాయణ యాజమాన్యం పెట్టే వత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థులు, వారి తల్లితండ్రుల ఆక్రందనలు వినబడలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అండతో అతిపెద్ద ఎడ్యుకేషన్ మాఫియాను సృష్టించినందుకే ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను మంత్రిని చేసారని గుర్తుచేశారు.

అసని తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, నిధులు కూడా యుధ్ధ ప్రాతిపదికన అందించడం జరిగిందని, తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారని తెలిపారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను దిశానిర్దేశం చేసారని శిబిరాలకు వచ్చే వ్యక్తికి రూ.1000, కుటుంబానికి రూ.2 వేల చొప్పున అందించాలని సీఎం అధికారులను ఆదేశించారని అన్నారు.

రాష్ట్రంలో గ్రామీణ రోడ్లకు సీఎం జగన్ మహర్దశను తీసుకొచ్చారని గత మూడేళ్లలో 3,705 కిలోమీటర్ల పొడవున కొత్తగా తారు రోడ్లు వేశారని, ఇవి కాకుండా 6,113 కి.మీ. మేర రోడ్లు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న రోడ్లు పోను మిగిలిన వాటికి కూడా రూ.1,072.72 కోట్లతో పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

ప్రజారోగ్యానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, వైద్య, ఆరోగ్య శాఖలోని ప్రజారోగ్య, సంక్షేమ విభాగానికి 2022-23 సంవత్సరానికి రూ.650 కోట్ల అదనపు నిధులు కేటాయించడం జరిగిందని, ఈ నిధులు మందుల కొనుగోలు, ఇతర సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నారని పేర్కొన్నారు.

Leave a Reply