దేశంలోని పెద్దశాతం ప్రజలైన హిందువుల రక్షాణార్థం కేంద్ర ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం వక్ఫ్ సవరణ బిల్. ఇది ఉభయ సభల్లోనూ ప్రజాస్వామ్యబద్ధంగా (లోగడ కాంగ్రెస్ చేసిన ఎమర్జన్సీ చట్టంలా కాకుండా) ఆమోదాన్ని పొందింది.
స్వతంత్ర భారతంలోనే కాదు. గత వెయ్యేళ్లలో హిందువులకు జరిగిన పెనుమేలు ఈ వక్ఫ్ సవరణ చట్టం. ఈ చారిత్రిక ఘట్టానికి ఆనందించకుండా, దేశ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇవాళ సాక్షి పత్రిక సంపాదకీయం రాసింది. గర్హనీయం; గర్హనీయం; గర్హనీయం ఇది.
సంపాదకీయం అన్నది పూర్తిగా పత్రిక మాట. ఎడిట్ పేజీలో వచ్చే ఇతర వ్యాసాలు ఆ వ్యాసాల రచయితల మాటలుగా పరిగణించవచ్చు. కానీ సంపాదకీయం మాత్రం పత్రిక మాటే.
వక్ఫ్ సవరణ బిల్ పా(ర్)లమంట్లో ఆమోదం పొందడాన్ని జీర్ణించుకోలేని సాక్షి పత్రిక తన అయిష్టాన్ని, అక్కసును, హిందూ వ్యతిరేకతను వెళ్లగక్కుతున్నట్టు స్పష్టంగా తెలియవస్తోంది! దారుణం ఇది.
దేశంలోని హిందువుల దీర్ఘకాల ఆకాంక్షను నెరవేర్చిన కేంద్ర ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతను తెలియజెయ్యాల్సిన పాత్రికేయం, ఇలాంటి సంపాదకీయం రాయడం హిందువుల ఆకాంక్షలను, ఆశలను ఆమోదించలేకపోవడమే. ఇందుమూలంగా సాక్షి తన హిందూ వ్యతిరేకతను బహిరంగంగా చాటుకుంటోందా?
ఈ వక్ఫ్ సవరణ చట్టం ప్రజా చట్టం; హిందు ప్రజలు కావాలనుకున్న చట్టం; హిందు ప్రజలకు కావాల్సిన చట్టం. ఈ దేశంలోని పెద్దశాతం ప్రజలు హిందువులే. ప్రజాస్వామ్య ప్రమాణాల పరంగా హిందువుల మాటే నెగ్గాలి; హిందువులదే దేశంలో ‘పై చేయి’ అవాలి. అదే అయింది. హిందువుల ఆకాంక్ష ఫలించింది.
వక్ఫ్ సవరణ బిల్ నెరవేరడం అన్న దేశ ప్రయోజనకర పరిణామంలో, ప్రధాన భాగమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సాక్షి విషం కక్కింది. దారుణం ఇది. హిందువుల ఓట్లతో ఐదేళ్లు ప్రభుత్వం చేసిన వై.సి.పి. ఈ బిల్ కు వ్యతిరేకం అవడం క్షమార్హం కాదు.
చంద్రబాబు నాయుడు ఈ చట్టానికి అనుకూలంగా వ్యవహరించి..దేశ హిందూ ప్రజల, రాష్ట్ర ప్రజల అభిమానాన్ని పొందారు. ఈ చట్టాన్ని ఆమోదించి చంద్రబాబు తన రాజకీయ జీవితంలో అత్యున్నతమైన పని చేశారు; సరైన రాజకీయ నాయకుడుగా నిలిచారు. ఆయనకు అభినందనలు.
హిందు, దేశ ప్రయోజనకర బిల్ పై వ్యతిరేకత వెళ్లగక్కిన సాక్షి ఇకనైనా ఆత్మ సమీక్ష చేసుకోవాలి. హిందువులు కొంటూంటేనే సాక్షి పత్రిక నడుస్తోంది. సాక్షి సంపాదకుడికి, ఎడిట్ పేజ్ ఇన్చార్జ్ కు జీతాలు హిందువుల డబ్బుతోనే వస్తున్నాయి. హిందువుల సొమ్ము తింటూ వాళ్ల రొమ్మే గుద్దుతున్నట్టుగా సాక్షి పాత్రికేయం ఉండడాన్ని ఏమనాలి? ఏం చెయ్యాలి?
ముస్లీములు, క్రిస్టిఅనులు, కమ్యూనిస్టులు మాత్రమే కొంటే సాక్షి ఆదాయం, సంపాదక వర్గం జీతాలు ఇప్పుడున్న మేరకు ఉంటాయా? సాక్షి కార్యాలయంలో కూర్చోడానికి కుర్చీలైనా ఉంటాయా?
సాక్షి యాజమాన్యం, సంపాదక వర్గం మాకు ‘హిందువుల డబ్బు వద్దు’ అని, సిగ్గున్న నిర్ణయం తీసుకుని ఇలాంటి రాతలు రాయాలి.
‘హిందు ప్రజలకు, హిందూ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పాత్రికేయమైనా అధమమైన పాత్రికేయం ఔతుంది’.
సాక్షి తన తప్పుల్ని దిద్దుకుని భవిష్యత్తులోనైనా దేశంలోని పెద్దశాతం ప్రజలతోనూ, ప్రజా ప్రభుత్వాలతోనూ కలిసి పని చెయ్యం నేర్చుకోవాలి. విదేశీ మతం కాదు ‘ఏ పాత్రికేయానికైనా దేశ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం, లక్ష్యంగా ఉండాలి’.
రోచిష్మాన్
9444012279