Suryaa.co.in

Andhra Pradesh

చెరువుల గండ్లను పూడ్చివేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు

– వర్షాలు పడుతున్నప్పటికీ గండ్ల పూడ్చివేత పనులు నిర్విరామంగా కొనసాగాలని ఎమ్మెల్యే వసంత విజ్ఞప్తి

మైలవరం: మైలవరం నియోజకవర్గ పరిధిలో చెరువుల గండ్లు పూడ్చివేతకు యుద్ధప్రాతిపదికన విస్తృతంగా చర్యలు చేపట్టినట్లు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు గుత్తేదారులు ఎస్.ఈ పి.ఎల్ కృష్ణమోహన్ గారు, మరో కాంట్రాక్టర్ శివశంకర్ గారికి ప్రభుత్వం ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించిన్నట్లు పేర్కొన్నారు.

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆకువాని చెరువుకు పూడ్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే గండిని పూడ్చివేయించారు. మైలవరం నియోజకవర్గంలో హవేలి ముత్యాలంపాడుతో పాటు వివిధ గ్రామాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. చెరువుల గండ్లు పూడ్చివేత పనులను స్వయంగా పర్యవేక్షించారు.

ప్రజలతో పాటు, రైతు సోదరులు, ఎన్డీఏ మహాకూటమి నాయకులందరూ చెరువులకు పడిన గండ్లను పూడ్చివేతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే క్రమంలో అందరూ బాధ్యతయుతంగా ఉండాలన్నారు.

LEAVE A RESPONSE