Suryaa.co.in

Andhra Pradesh

తిరుపతిలో సీఎస్,డీజీపీలకు ఘన స్వాగతం

ఈనెల 14 న తిరుపతి తాజ్ హోటల్ నందు జరగనున్న 29 వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేం దుకు జిల్లా కు విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకి జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ శనివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు.సి ఎస్ తో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ కి అనంతపురం డిఐజి క్రాంతి రాణా టాటా, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు స్వాగతం పలికారు.రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డికి సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ స్వర్ణలత,జాయింట్ డైరెక్టర్ కస్తూరి తేళ్ల, చిత్తూరు డిడి లీలావతి సంబంధింత అధి కారులు స్వాగతం పలికారు..వీరితో పాటు రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ లక్ష్మీ విచ్చేశారు…

LEAVE A RESPONSE