Suryaa.co.in

Telangana

సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు

-ప్రకాశ్ జవదేకర్ దైవ భక్తి ఉన్న నాయకుడు
-చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదు
-73 ఏళ్ల వ్యక్తిపై ఇంత దుర్మార్గపు ప్రచారమా?
-సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు చేస్తున్న దుష్ప్రచారమిది
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడి

కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పులేసుకుని వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. 73 ఏళ్ల ప్రకాశ్ జవదేకర్ దైవ భక్తుడు. చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదు…చెప్పులు విడిచి సాక్సులతో ఆలయంలోకి వెళ్లారు. నేను వారితోనే ఉన్నా.’’అని స్పష్టం చేశారు.

సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు చేసే ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అయ్యగారిని అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు.

ఈరోజు కరీంనగర్ లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను పర్యవేక్షించడానికి ని టవర్ సర్కిల్ వద్దకు వచ్చిన బండి సంజయ్ వద్ద మీడియా ప్రతినిధులు ఈ అంశాన్న ప్రస్తావించగా పైవిధంగా బదులిచ్చారు. ప్రకాశ్ జవదేకర్ వయసు 73 ఏండ్ల పెద్దాయన. నడుస్తుంటే జారి కింద పడబోతే పట్టుకున్నా… దానిని కూడా ఫాల్తుగాళ్లు రాద్దాంతం చేస్తారా? అంటూ మండిపడ్డారు.

LEAVE A RESPONSE