అబ్దుల్లాకి ఐదు నిమిషాల్లో నాయుడు దావోస్లో ఏమంత్రం వేశారో.. 6 నెలల్లో ఆంధ్రాకి వచ్చారు.
దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో.. ప్రపంచ దిగ్గజాలు, దేశాధినేతల మధ్య.. యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రిని కలిశారు మన చంద్రబాబు నాయుడు. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే! ఆ ఐదు నిమిషాల్లోనే అద్భుతం జరిగింది.
ఏపీ అపార సంపద, పారిశ్రామిక విజన్, భవిష్యత్ ప్రణాళికలు.. అన్నీ అలవోకగా, అల్ మర్రి మెదడులో ఇంకిపోయేలా వివరించారు చంద్రబాబు. ఆ ఐదు నిమిషాల ప్రెజెంటేషన్కి మంత్రముగ్ధులైన అల్ మర్రి.. “కేవలం 5 నిముషాల్లో ఏపీ గురించి చెప్పారు. ఆరు నెలల్లో మేం ఏపీకి వచ్చి సదస్సు నిర్వహిస్తున్నాం” అని స్వయంగా ప్రకటించారు.
ఫలితం?
దావోస్ మంత్రం ఇప్పుడు విజయవాడలో సాకారమైంది!
ఇన్వెస్టోపియా-ఏపీఈడీబీ మధ్య చారిత్రాత్మక ఒప్పందం!
లులూ ఇంటర్నేషనల్ ఛైర్మన్ యూసుఫ్ అలీ స్వయంగా విశాఖలో అల్ట్రా మోడర్న్ షాపింగ్ మాల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు! (వేలల్లో ఉద్యోగాలు!)
అంతేకాదు, ఇతర నగరాల్లోనూ విస్తరణ, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకి కూడా సన్నాహాలు.
ఇది మామూలు ఒప్పందం కాదు! ఒక విజనరీ నాయకుడు ఐదు నిమిషాల్లో చెప్పిన విజన్.. కొన్ని నెలల్లోనే రియాలిటీగా మారుతోంది. ఏఐ, ఫ్యూచర్ ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ, టూరిజం.. ఇలా అనేక రంగాల్లో యూఏఈ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది.
ఏపీ ప్రజలకు ఇది కేవలం ఒక ఒప్పందం కాదు.. ఆశ, ఉపాధి, అభివృద్ధికి నూతన శకం!
దావోస్లో పడిన విత్తనం.. ఇప్పుడు బెజవాడలో భారీ వృక్షంగా ఎదుగుతోంది.