Suryaa.co.in

Telangana

ముఖ్యమంత్రుల జిల్లాలో మొదటి మేజర్ కు నీటి కరువు

-టెల్ ఎండ్ పేరుతో రాజవరం మొదటి మేజర్ ను ఎండబెట్టింది జానారెడ్డి యే
-అందుకే ఆయనను ఇంటికి పంపిండ్రు
-టెల్ ఎండ్@తోక చివరి భూముల పేరుతో టోకరా
-సమైక్యాంధ్రలో తోకే కుక్కను ఆడించిన వైనం
-సాగర్ ఎడమ కాలువకు మొదటి మేజర్ రాజవరం
-గులాబీ పాలనలో సమృద్ధిగా నీరు
-ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మాయమైన టెల్ ఎండ్ పదం
-టెల్ ఎండ్ అంటే నూజివీడు, రాజమండ్రి లే
-గులాబీ జెండా నీడలో వెలుగులు
-గ్రామాలకు పారుతున్న నిధుల వరద
– మంత్రి జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రుల జిల్లాగా పేరొందిన నల్లగొండ జిల్లాలో టెల్ ఎండ్ పేరుతో పొలాలను బీళ్లుగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. టెల్ ఎండ్ పేరుతో సాగర్ ఎడమ కాలువ కు మొదటి మేజర్ గా ఉన్న రాజవరం మొదటి మేజర్ కింద ఉన్న వేలాది ఎకరాల భూములను ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని ఆయన విరుచుకుపడ్డారు. కుక్క తోకను ఆడించిన చందంగా అప్పుడు ఆంధ్రా అధికారులు టెల్ ఎండ్ పేరుతో ఇక్కడి భూములను ఎండపెట్టి ఆంధ్రకు నీళ్లు పారించారంటూ ఆయన నిప్పులు చెరిగారు. అటువంటి మొదటి మేజర్ కు నీళ్లు అందించి రాజవారం మొదటి మేజర్ కింద భూములను సస్యశ్యామలం చేసిన ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని ఆయన స్పష్టం చేశారు. బి ఆర్ యస్ పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలలో భాగంగా సోమవారం రోజున నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని గుఱ్ఱంపోడు మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు నోముల భగత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మేళనానికి ఆయనముఖ్య అతిథిగా హాజరయ్యారు.

టెల్ ఎండ్ పేరుతో సాగర్ ఎడమ కాలువ కింద భూములను ఎండ బెట్టిన పాపం కాంగ్రెస్ పార్టీకీ శాపంగా పరిణమిస్తే సాగర్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవుతానంటూ కలలు కన్న జానారెడ్డిని ఇక్కడి ప్రజలు వరుస ఎన్నికలో ఓడించారన్నారు. అటువంటి టెల్ ఎండ్ అనే పదం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మాయమైందన్నారు.టెల్ ఎండ్ అంటే అది నూజివీడు, రాజమండ్రి లే నన్నారు.గులాబీ జెండా నీడలు తెలంగాణా లో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు.స్వరాష్ట్రంలో సుపరిపాలన అన్న నానుడిని నిజం చేస్తూ గ్రామాలకు నిధుల వరద పారుతుందన్నారు.వేయ్యి మంది ఉన్న జనాభాకు 10 కోట్లు,2000 పై చిలుకు ఉన్న గ్రామాలకు చేరుతున్న 20 కోట్ల నిధులు ఇందుకు అద్దం పడుతుందన్నారు. ఆసరా ఫించన్లు,కల్యాణలక్ష్మీ/షాధిముబారక్, కేసీఆర్ కిట్,రైతుబందు, రైతుభీమా,రుణమాఫీ, అంతర్గత రహదారుల నిర్మణాలతో పాటు రాష్ట్రంలో వెలుగు జిలుగులు విరజిమ్ముతున్న విద్యుదీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చులు పరిశీలన లోకి తీసుకుంటే ప్రతి ఒక్కరికీ ఈ అంశం భోదపడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధించారు.

LEAVE A RESPONSE