వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్
హైదరాబాద్: మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ విద్యార్థులకు స్వాగతం తెలిపారు. ఇంఫాల్ నుంచి 106 మంది విద్యార్థులు రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్‌రామ్ మాట్లాడుతూ.. మణిపూర్ నుంచి ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు తరలిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల తరలింపుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, విద్యార్థుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ సైతం ఏర్పాటు చేశామని ఎంపీ భరత్ చెప్పారు.