– విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు
– మా ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుంది
– హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంఖుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశం వస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నా జన్మ సుకృతం. కాంక్రీట్ జంగిల్ లో ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించేందుకు ఇక్కడ హెరిటేజ్ టవర్ నిర్మిచడం గొప్ప విషయం.
ఈ టవర్ 430 అడుగుల ఎత్తు నిర్మితం కావడం రాష్ట్రానికి గర్వకారణం. 36 లేదా 40 నెలల్లో ఈ టవర్ నిర్మణం పూర్తి అవుతుంది. అది మళ్లీ మనమే ప్రారంభించుకుందాం. ఇది చరిత్రలో నిలిచిపోయే గొప్ప సందర్భం. వందేళ్ల క్రితమే హైదరాబాద్ ను నిజాం లేక్ సిటీగా అభివృద్ధి చేశారు.
కోట్లాది మంది దాహార్తిని తీర్చే చెరువుల పరిధిలో విలాసాల కోసం కొందరు ఫామ్ హౌస్ లు నిర్మించుకున్నారు. నగరానికి తాగునీరు అందించే గండిపేట్, హిమాయత్ సాగర్ లోకి ఫామ్ హౌస్ ల నుంచి వ్యర్ధజలాలు వదులుతున్నారు. వీటిని ఇలాగే వదిలేస్తే మేము ప్రజా ప్రతినిధులుగా ఉండి వ్యర్ధమే.అందుకే హైడ్రా ద్వారా… చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం.
కురుక్షేత్ర యుద్ధం సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్పూర్తితో.. చెరువుల ఆక్రమనలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. ఇది రాజకీయాల కోసం, రాజకీయ కక్షల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు. భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాం.
ఎవరు ఎన్ని ఒత్తిడులు తెచ్చినా చెరువుల ఆక్రమణదారుల భరతం పడతాం. ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తిగా మా ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుంది. విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, క్యాన్సర్ ఆస్పత్రులల్లో భోజనం అందించేందుకు హరే కృష్ణ ఫౌండేషన్ ను సహకారం కోరుతున్నాం. ఇందుకోసం ప్రభుత్వం వైపు నుంచి మీకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం.