– టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేష్
సుదీర్ఘ కాలంగా కుప్పం ప్రశాంతతకు నిలయం. అటువంటిదాన్ని ఫ్యాక్షన్ ప్రాంతంగా మార్చారు. గతంలో అక్కడ అధికారపక్షంవారు, ప్రతిపక్షంవారు అన్నదమ్ముల్లా కలిసి సుదీర్ఘకాలంగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అరాచకాలా? పేదల కడుపు నింపడానికి సొంత నిధులతో అన్నా క్యాంటిన్ ను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ అధికారులు వైసీపీ గూండాల సహాయంతో కూల్చుతారా? ఇది చాలా దారుణమైన విషయం. చంద్రబాబును నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకోవడం అన్యాయం. త్వరలో ప్రభుత్వం మారబోతోంది. చంద్రబాబునాయుడును అడ్డుకోవడంతో నీ పతనం ప్రారంభమైంది. ఎన్నిరోజులు ఆపుతారో చూస్తాను. ప్రతి కార్యకర్త కుప్పంకు తరలి వచ్చి కూల్చిన క్యాంటిన్ ను మళ్లి నిలబట్టబోతున్నాం. ఖబడ్దార్. జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు నేడు సైకోల్లా తయారయ్యారు వీరి పతనం ఖాయం.