నీ కడుపు చీల్చి సాగు చేసి మమ్మల్ని పోషిస్తున్నావు. లోకమంతా నిన్ను మట్టి అంటుంది..!
మేము నిన్ను మాతల్లి… ‘భూమాత’ అంటాం.
మేము హిందువులం!
లోకమంతా వెలుగు నిచ్చావు. మా బ్రతుకు దీపమై నిలిచావు. ఇతరులు నిన్ను మండే అగ్నిగోళం అన్నారు.
మేము నిన్ను సూర్య నారాయణుడు అన్నాం, సూర్య భగవానుడు అన్నాం.
మేము హిందువులం!!
నీ స్పర్శతో బీడుభూములు.. బంగరు భూములయ్యాయి. నీ చలువతో దాహార్తుల ఆర్తనాదం చల్లారింది. అన్యులు నిన్ను జలప్రవాహం అన్నారు.
మేము నిన్ను నదీమతల్లి అంటాం. గంగమ్మ అంటాము. మా ఇంటి ఆడబిడ్డలా లాంచనాలిస్తాం., హారతులిస్తాం., ఆదరిస్తాం. పుష్కర సంబరాలు చేస్తాం.
మేము హిందువులం!!!
జన్మనిచ్చిన తల్లి, నడవడిక నేర్పిన నాన్న, విద్య నేర్పిన గురువులకి ‘అది వాళ్ళ బాధ్యత’ అనుకున్నారు అంతా.
మేము.. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నాం.
మేము హిందువులం!!!!
ఇతర మ్లేచ్య జాతులు హిందూ జాతిని దోచుకున్నాయి కాని… హిందువులు ఎవ్వరినీ దోచుకోలేదు, ఆ అవసరం కూడా లేదు..!
ఇది రత్నగర్బ. వేదభూమి. ధన సంపదకి, జ్ఞాన సంపదకి పుట్టినిల్లు. నలంద, తక్షశిల లాంటి అనేక విశ్వవిద్యాలయాలు వేల యేళ్ళనాడే వున్నాయి. అడిగితే బిక్ష పెట్టేవాళ్ళం..!పంచి ఇచ్చే ఔదార్యం మనది..! దోపిడీ సంస్కృతి వాళ్ళది..!
మేము హిందువులం!!!!!
పాశ్చాత్య దేశాలు చీమిడిముక్కుతో, చింపిరి బట్టలతో తిరిగేటప్పుడే పట్టు వస్త్రాలు కట్టిన ఘన చరిత మాది..!
నాగరికతలో ప్రపంచం కళ్ళుకూడా తెరవకుండా పసికూనగా ఉన్నప్పుడే అంబరాన్ని అంటిన ఘనత… మాది!
మేము హిందువులం!!!!!
మహోన్నతమైన సనాతన సంస్కృతికి వారసులం అని తలచుకున్నప్పుడల్లా..‘మా హృదయం ఉప్పొంగుతుంది.. మా కళ్ళల్లో వెలుగొస్తుంది. మా నరనరాల్లో రక్తం ఉరకలేస్తుంది.
ప్రపంచమంతా ప్రతిద్వనించేలా గర్వంగా ఘర్జిస్తున్నాం….”
మేము హిందువులం!!!!!
“హిందుత్వం మతం కాదు! జీవన విధానం…!! ప్రకృతి పై కృతజ్ఞతతో కూడిన ఉత్తమమైన జీవన విధానం!”
మేము హిందువులం.!
సేకరణ
– హరికృష్ణ