Suryaa.co.in

Features

మన సనాతన సంస్కృతిని మనమే అవమానిస్తున్నాం

చాలా రోజుల నుంచి ఉన్న నా మనసులోని ఆవేదన మీ ముందు పెడుతున్నాను.
ఈద్ రోజున మసీదు ముందు ముస్లింలు మద్యం మత్తులో అసభ్యకరమైన పాటలు వేసి, నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?
లేదు కదా !!!
ఏసుక్రీస్తు ముందు శాంతాబాయి పాటకు క్రైస్తవులు నృత్యం చేయడం మీరెప్పుడైనా చూశారా?
అదీ లేదు కదా !!!
మరి జైన మతస్థులు తమ దేవుడి ముందు ఆలా బాబూరావు పాట పాడుతూ నృత్యం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా?
చూడలేదు కదూ !!!

ఈ సమాజాలన్నీ ఎంతో చిత్తశుద్ధితో తమ సొంత ప్రయోజనాలను గౌరవిస్తాయి. ఎందుకంటే వారు తమ సంస్కృతి కోసం తమ మతాన్ని కాపాడుకోవాలి కాబట్టి, కాపాడుకుంటున్నారు కూడా. మరి లాంటప్పుడు, మన హిందూ మతానికి చెందిన దేవుళ్ళ ముందు, చిత్తుగా మద్యం తాగి, ఆ మత్తులో అసభ్యకరమైన పాటలకు డీజే పెట్టి మరీ ఈ అసభ్య అర్థ నగ్న నృత్యాలు ఎందుకు ? ఈ కళంకం మన హిందూ సమాజంపై ఎవరు, ఎందుకు విధించారు లేక మనమే ఆలా చేస్తున్నామా ? డీజే లపై అసభ్యకరమైన పాటలు పెట్టి, గౌరవించి, కాపాడుకోవాల్సిన మన సనాతన సంస్కృతిని మనమే అవమానిస్తున్నాం, అగౌరవపరుస్తున్నాము.

ఎందుకు ?
మన పండుగలు చాలా ఉత్సాహంగా, పెద్ద ఎత్తున జరుపుకోవాలి. కాదనడం లేదు. సంప్రదాయ సంగీత వాయిద్యాలు, సాంప్రదాయ దుస్తులు, మన వైభవాన్ని చాటి చెప్పే తలపాగా వంటి వాటిని ధరించి, ప్రతి హిందువుల పండుగలో మనం కనిపించాలి. అప్పుడే మన సనాతన సంస్కృతి నిలబడుతుంది.
వాళ్ళు మనలా తమ మతపరమైన కార్యక్రమంలో ఎలాంటి దుబారా చేయరు.

కనీసం ఇప్పటి నుంచైనా, గణేశోత్సవం, దశర, నవరాత్రులు మొదలైన పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం. మన సంస్కృతిని కాపాడుకుందాం. ఇతరులకు మార్గదర్శకంగా ఉందాం. డీజే లకు బదులుగా హిందూ భక్తి పాటలు, సంగీతం ఆధారంగా శ్లోకాలు పెట్టి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుదాం.

– మద్దికుంట శ్రీకాంత్ శర్మ
హిందూ ధర్మచక్రం సేవా సమితి
9849485645

LEAVE A RESPONSE