Suryaa.co.in

Telangana

కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నాం

– హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ

హైదరాబాద్: నగరంలో అక్రమకట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎన్టీఎల్, బఫర్లోజోన్లో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామన్నారు. “ఎన్టీఎల్, బఫరోజోన్లో ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చివేయం. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణదశలో ఉన్నాయి. బఫర్ జోన్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు. సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్య పరంగా వినియోగిస్తున్నారు. అందుకే వాటిని కూల్చివేస్తున్నాం” అని రంగనాథ్ తెలిపారు

LEAVE A RESPONSE