-సేకరణకు ఎఫ్.సి.ఐ సంపూర్ణ సహకారం అందించాలి
-దేశానికి అన్నం పెట్టే తెలంగాణను ప్రోత్సహించాలి
-తెలంగాణ ఏర్పాటు నుండి 672 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతులకు 1.21 కోట్లను అందించాం
-ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు అనుకూల విధానాలతోనే దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ
-యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో నెం1 తెలంగాణ
-అవసరమైన కొనుగోలు కేంద్రాల గుర్తింపు, జియోటాగింగ్, ట్రాన్స్ పోర్టు, మిల్లర్ల అనుసందానం -గన్నీలు, ప్యాడీక్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, టార్పాలిన్లపై సమగ్ర ప్రణాళిక
-రైతులు ఖచ్చితమైన ఎఫ్.ఏ.క్యూ ధాన్యం ఇచ్చేలా అన్ని వసతులు
-సంపూర్ణ వివరాలతో ముఖ్యమంత్రికి నివేదిక
-సివిల్ సప్లైస్ ఐవీఆర్ఎస్ నెంబర్ 79975 12345 ప్రారంభం
-యాసంగి ధాన్యం సేకరణ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై అడిషనల్ కలెక్టర్లు, డీసీఎస్వోలు, డీఎంలు, ఎఫ్.సి.ఐ ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష
సీఎం కేసీఆర్ దార్శనికతతో దేశానికి అన్నపూర్ణగా తెలంగాణను మలిచి రాష్ట్ర ఏర్పాటు నుండి ఇప్పటివరకూ రైతాంగానికి 1 కోటి 21 లక్షల కోట్లను ధాన్యం సేకరణ ద్వారా అందజేసామన్నారు, యాసంగి ధాన్యం సేకరణలో దేశంలోనే నెం1గా ఉన్నామన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, ఎఫ్.సి.ఐ ఉన్నతాధికారులు, కంటైనర్ కార్పోరేషన్ ఈడి, పౌరసరఫరాల డీసీఎస్వోలు, డీఏంలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి తో, రైతుబందు, 24గంటల ఉచిత కరెంటు, ఎంఎస్పీతో ధాన్యం సేకరణ తదితర రైతు అనుకూల విధానాలతో దేశంలోనే యాసంగి ధాన్యం సేకరణలో మొదటిస్థాయిలో నిలిచామని, అదే స్పూర్తిని కొనసాగిస్తూ రాబోయే యాసంగి ధాన్యం సేకరణకు సమాయాత్తమవ్వాలని అధికారులకు సూచించారు, కరోనా వంటి సంక్షోభంలోనూ 92 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు క్రుషి చేసిన అధికారులకు అభినందనలు తెలుపుతూనే విధుల్లో అలసత్వం ప్రదర్శించినా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి గంగుల కమలాకర్.
కొనుగోలు కేంద్రాల గుర్తింపు, జియోటాగింగ్, ట్రాన్స్ పోర్టు, మిల్లర్ల అనుసందానం, గన్నీలు, ప్యాడీక్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు, టార్పాలిన్లు తదితర అన్ని వనరులను సంపూర్ణంగా సిద్దం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్.సి.ఐ ఉన్నతాధికారులతో సీఎంఆర్ అందించడానికి సంపూర్ణంగా సిద్దంగా ఉన్నామని తెలిపిన మంత్రి, గోడౌన్ స్పైష్ తో పాటు, ర్యాక్ మూమెంట్లు, మిల్లుల టాగింగ్, రిసివింగ్ గోడౌన్స్ లో అక్సెప్టెన్సీ మిషన్లను పెంచడం, హమాలీల కొరత లేకుండా చూడడం వంటి చర్యల్ని తీసుకొని ప్రతీరోజు అత్యదికంగా ఎసీకేలు తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమయం తక్కువ ఉన్నందున ఈ సమస్యల పరిష్కారం వీలుకాకపోతే వీటిని స్థానిక ఎప్.సి.ఐ అధికారులు ఎప్.సి.ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెల్లి సీఎంఆర్ గడువు పెంపుకోసం అభ్యర్థించాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతోనూ గన్నీల తరలింపుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఉన్నతాధికారులతో అన్ని అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించిన మంత్రి గంగుల, అకాల వర్షాలకు అనుగుణంగా కొనుగోలు ఏర్పాట్లు చేసేలా సమగ్ర యాక్షన్ ప్లాన్ని రూపొందించి ముఖ్యమంత్రి ఆమోదానికి పంపుతామని సూచించారు. సివిల్ సప్లైస్ శాఖకు సంబందించిన సేవల్ని పౌరులకు మరింత చేరువ చేసేందుకు ఐవీఆర్ఎస్ నెంబర్ 799712345ను మంత్రి గంగుల ప్రారంభించారు, వీటి ద్వారా కొత్త ఎప్.ఎస్.సి కార్డుల సమస్యలు, పోర్టబులిటీ వీలు కలుగుతుంది. ఈ అప్లికేషన్ రూపకల్పనలో కృషి చేసిన ఎన్.ఐ.సి ఉద్యోగులను అభినందించి మెరిట్ సర్టిఫికెట్లను మంత్రి గంగుల కమలాకర్ ప్రధానం చేసారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, పౌరసరఫరాల కమిషనర్ వి. అనిల్ కుమార్, ఎప్.సి.ఐ డీజీఎం కిరణ్ కుమార్, కంక్వేర్ ఈడీ జి.ఆర్. శేషగిరి రావ్, అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, పౌరసరఫరాల జీఎంలు, డిసీఎస్వోలు, డీఎంలు పాల్గొన్నారు.