అసెంబ్లీలో ప్రతిపక్షంపై దాడిని ఖండిస్తున్నాం
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
బ్లాక్ జీవ్ (జీవో నెం.1)పై నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షపార్టీ నాయకులపై అసెంబ్లీ సాక్షిగా భౌతిక దాడులకు అధికారపక్షం పాల్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎమ్యెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని, వివేకానందరెడ్డి హత్యలో జగన్ రెడ్డి సోదరుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అంశంపై ప్రజా దృష్టిని మళ్లించడానికే టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి చేయించారు. ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ. శాసనసభలో దాడులు జరగడం జగన్ రెడ్డి విపరీత మనస్థత్వానికి అద్దం పడుతుంది. గవర్నర్ దృష్టి సారించి శాసనసభ ప్రతిష్టను కాపాడాలి. ప్రజాస్వామ్య వాదులందరు ఈ దుశ్చర్యను ఖండించాలి.