సికింద్రాబాద్ పరిధిలో అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ఏర్పాట్లు జరుపుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగూడ లోని మున్సిపల్ మైదానంలో రెండో విడత హరిత హారాన్ని శనివారం తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించాలని, ముక్కలను విరివిగా నాటాలని కోరారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు రాసురి సునీత, కుమారి సామల హేమ, తెరాస యువ నేతలు కిశోరే కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, ఉప కమీషనర్ మోహన్ రెడ్డి, అధికారులు ఆశలత, రాఘవేందర్, రమణ రెడ్డి, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, అధికారులు, నేతలు పాల్గొన్నారు.
పనుల ప్రారంభం :
సితాఫలమండీ డివిజన్ పరిధిలో Rs. 23.50 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న సివరేజ్ పైప్ లైన్ నిర్మాణం పనులను తీగుల్ల పద్మారావు గౌడ్ శనివారం ప్రారంభించారు. చిలకలగూడ లోని ఎరుకల బస్తి, లైఫ్ స్ప్రింగ్ హాస్పటల్ ప్రాంతాల్లో పనులను ప్రారంభించిన సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సమస్యలను పరిష్కరించ గలిగామని, సివరేజి సమస్యలను కుడా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్ కుమారి సామల హేమ, జలమండలి జనరల్ మేనేజర్ రమణ రెడ్డి, ఈ ఈ ఆశా లతా, తెరాస యువ నేతలు కిశోరే కుమార్, రామేశ్వర్ గౌడ్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సి సి కెమెరాల ప్రారంభం :
శ్రీనివాస్ నగర్ కాలనీలో స్థానిక కాలనీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్న సి సి కెమెరాలను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తమ నియోజకవర్గ అభివృధి నిధుల ద్వారా రూ.రెండు కోట్ల మేరకు నిధులను కేవలం సి సి కెమెరాల ఏర్పాటుకు కేటాయించమని పద్మారావు గౌడ్ తెలిపారు. శ్రీనివాస్ నగర్ కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని అయన తెలిపారు. కార్పొరేటర్ కుమారి సామల హేమ, అధికారులతో పాటు కాలనీ సంఘం ప్రతినిధులు విజయ్, లక్ష్మి, వాసు తదితరులు పాల్గొన్నారు.