– వాళ్లని ఉరి తీసినా తప్పు లేదు
– తెలంగాణ రాష్ట్ర అప్పు ఏడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు)
– అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా.. దేనికి మీ పరామర్శలు?
– అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పుల వల్లే తమ ప్రభుత్వం ఆరుగ్యారంటీలను అమలు చేయలేకపోతోందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తేల్చేశారు. ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీన్ని బట్టి ఇక ఇప్పట్లో ఆరుగ్యారంటీలు తమ ప్రభుత్వం అమలుచేయదని రేవంత్ పరోక్షంగా చెప్పిన ట్టయింది.
అసెంబ్లీలో రేవంత్ ఇంకా ఏమన్నారంటే… తెలంగాణ రాష్ట్ర అప్పు మొత్తం డిసెంబర్ 18-2024 నాటికి 7,227,88 కోట్లు.. (ఏడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు) బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. 11.5 వడ్డీ రేటుకు అప్పులు తెచ్చారు. వాళ్లని ఉరి తీసినా తప్పు లేదు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పుల వల్లే ఇప్పుడు మేం ఆరు గ్యారంటీలు అమలు చేయలేక పోతున్నాం..
కొడంగల్ ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. కానీ, కోట్లు ఖర్చు చేసి.. అధికారుల మీద దాడి చేయించారు. అధికారులను చంపినంత పని చేశారు.. కొడంగల్‌లో పరిశ్రమలు పెట్టొద్దా? ఉద్యోగాలు ఇవ్వకూడదా? అబద్దాల సంఘానికి అధ్యక్షుడు ( కేసీఆర్ ) అసెంబ్లీకి రాలేదు. ఉపాధ్యక్షుడు ( కేటీఆర్ ) వచ్చి, అదే అబద్దాలు చెప్తున్నాడు.
అల్లు అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా.. దేనికి మీ పరామర్శలు?