Suryaa.co.in

Telangana

జనం ఉమ్మేస్తున్నారు పుష్పా!

– ఇంత పొగరేందిమే..
– రేవంత్ సినిమా వాళ్ల బలుపు అణచివేశాడప్పా
– రేవంతే రైటంటున్న జనం ఏసీపీ
– 25 లక్షలు ఇస్తే అల్లు అర్జున్ తన ప్రాణాలు ఇస్తాడా ?

న్యాయస్థానం లో అల్లుఅర్జున్ కు బెయిలు రావడం అల్లు అర్జున్ అభిమానులు ఆనందపడి ఉండవచ్చు. కానీ సాధారణ పౌరులు మాత్రం న్యాయం అమ్ముడుపోయింది అన్న భావనలో ఉన్నారు.కోటీశ్వరుల కు ఆఘమేఘాల మీద కేసులమీద విచారణలు జరగడం.. బెయిల్ రావడం ఆనవాయితీ గా మారింది. జగన్ లాయర్లు రావడం తోనే న్యాయం ఏకపక్షo గా జరగబోతున్నదని కొందరు న్యాయవాదులు అప్పుడే వ్యాఖ్యానించడం విచిత్రం.

వాస్తవాలను జడ్జిముందు రాకుండా హంగామా చేసి అల్లు అర్జున్ తప్పు ఏమాత్రం లేదన్నట్లు ..కొందరు రాజకీయ ప్రముఖులు మాట్లాడి మొత్తం సమస్య తప్పు త్రోవ పట్టించడానికి. కోట్లు ఖర్చు చేసి పెయిడ్ యూ ట్యూబ్ చానల్స్ లో అది ప్రభుత్వ తప్పిదం గా ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి పై దుమ్మెత్తి పోశారు.

ఈరోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా జరిగిన వాస్తవాలు చెప్పడం తో సినీ పెద్దలం అని చెప్పుకొనే వారిపై జనం ఉమ్మేస్తున్నారు. ఇన్ని రోజులు జరిగిన ప్రచారం మొత్తం అబద్దం. పుష్ప రిలీజ్ గురించి సంద్య ధియేటర్ వాళ్ళు సంప్రదించి లెటర్ ఇచ్చిన మాట వాస్తవం. కానీ క్రౌడ్ ఎక్కువ గా ఉంటుంది హీరో,హీరోయిన్ రావద్దు అని పోలీస్ లెటర్ వాపస్ ఇచ్చారు. కానీ అల్లు అర్జున్ ధియేటర్ కు వచ్చాడు.

మామూలుగా థియేటర్ కు వచ్చి ఫిల్మ్ చూస్తే సమస్య లేదు. కానీ సన్ రూఫ్ ఓపెన్ చేసి చేతులు ఊపుకొంటూ రోడ్డు షో చేయడం తో జనం ఒక్కసారిగా జమ అవ్వడం జరిగింది.ఆ జనం లో అల్లు అర్జున్ బాడీ గార్డ్స్ ప్రేక్షకులను త్రోసి వేయడం తో, తొక్కిసలాట జరిగి, ఒక అమ్మాయి చనిపోవడం.. ఆమె కుమారుడు కోమాలోకి వెళ్ళడం జరిగింది. ఈ సంఘటన జరిగి నా అల్లు అర్జున్ సినిమా చూస్తూ కూర్చోవడం తో, ఏసీపీ అల్లుఅర్జున్ ను కలసి జరిగిన సంఘటన చెప్పి ఇంటికి పంపించి ప్రయత్నం చేస్తే.. ఏసీపీ ను కూడా ధియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ తో కలవనియ్యలేదు.

పరిస్తితి విషమించడం తో డీసీపీ రావడం జరిగింది. అప్పటికే బాల్కానీలో సినిమా చూస్తున్న అల్లు అర్జున్ కోసం.. క్రింద నుండి అభిమానులు బాల్కనీ పైకి ప్రాకడం మొదలు పెట్టారు. డీసీపీ అల్లు అర్జున్ ను బలవంతం గా థియేటర్ నుండి పంపించి వేస్తే , కారులో సన్ రూఫ్ తీసి మళ్ళీ రోడ్ షో చేస్తూ ఇంటికి వెళ్ళడం జరిగింది. చనిపోయిన అమ్మాయి గురించి అసలు పట్టించుకోలేదు. హాస్పిటల్ లో ఉన్న చిన్న బాబు గురించి ఎవ్వరూ పట్టించుకోని కారణం గా రేవంత్ రెడ్డి పోలీస్ చర్యలకు ఆర్డర్ ఇవ్వడంతో కేసు పెట్టి, అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళం తప్పా?

ఇదే సంఘటన మరో దేశం లో జరిగి ఉంటే, అల్లు అర్జున్ కు ఉరిశిక్ష పడేది. అల్లు అర్జున్ పోలీస్ మాట వినకపోవడం..తాను హీరో అన్న అహం తోనే ఈ సంఘటన జరిగింది తప్ప, అనుకోని సంఘటన ఏమాత్రం కాదు. ఓటర్లు రాజకీయ నాయకులకు దేవుళ్ళు అవుతే…ప్రేక్షకులు సినిమా వాళ్ళకు దేవుళ్లు . తమ వలన ఒక ప్రాణం పోతే సినీ ప్రముఖులు ఒక్కరూ 15 రోజులు స్పందించక పోగా.. కొన్ని గంటలు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అల్లు అర్జున్ పరామర్శ కోసం సినీ ప్రముఖులు లైన్ కట్టడం చూసిన ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి చేసిన మంచి పనికి ప్రజలు మెచ్చుకొంటుంటే, పనికిమాలిన వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. 25 లక్షలు ఇస్తే అల్లు అర్జున్ తన ప్రాణాలు ఇస్తాడా ? ఆ రోజు జరిగిన సంఘటన లో ప్రతి నిమిషం అల్లు అర్జున్ చేసిన పని తప్పుగా ఉంటే, న్యాయమూర్తికి అది న్యాయం గా ఎలా కనిపించింది? ప్రతిపక్ష నాయకులకు సినిమా వాళ్ళతో ఉన్న డ్రగ్ సంబంధాల వలన వాళ్ళను నెత్తిన మోయవచ్చు… సినిమా వాళ్ల వ్యభిచారం నచ్చవచ్చు…కానీ న్యాయం అందరికీ సమానం కదా ? ఒక పనికి మాలిన సినిమా బాగుందని థియేటర్లు ల వద్ద గంజాయి బ్యాచ్ తో సినిమా తోపు..తుడుమ్ అని పిచ్చి వాగుడు వాగిం చి.. యూ ట్యూబ్ లో ప్రచారం చేసుకొని జనాన్ని మోసగించడం తప్పు కాదా?

రేవంత్ రెడ్డి నాగార్జున మీద కానీ, మోహన్ బాబు మీద కానీ, అల్లు అర్జున్ మీద కానీ తీసుకొన్న చర్యలు ప్రజా హితం కోసం. ఏ నాయకుడు, ఏ పార్టీ కానీ ఇంతవరకు ఇలాంటి దైర్యం చేయలేదు. 10 మంది సినిమా వాళ్ళ కోసం 4 కోట్ల జనం హక్కులు హరించడం న్యాయమా? సెలబ్రిటీల పేరుతో అరాచకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?

రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ పట్ల కక్ష సాధింపు కాదు. త్రోవ తప్పిన సినీ రంగాన్ని గాడిలో పెట్టడం హర్షణీయం. సినీ రంగం వాళ్ళ కు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. సెలబ్రెటీ అన్న అహం వదులు కోకుంటే రాబోవు రోజుల్లో జనం చేతుల్లో పరాభవం తప్పదు. సమాజం లో అరాచకాలకు మూలం సినిమా వాళ్ళే అన్న ఆలోచన జనం లో ఎక్కువగా ఉంది. రేవంత్ రెడ్డి తీసుకొంటున్న నిర్ణయాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు.సినిమా వాళ్ళు హీరో లు కాదు. విలన్ గా మారి అరాచకాలు చేస్తుంటే త్వరలో జీరో లు కాక తప్పదు.

(సేకరణ)

LEAVE A RESPONSE