– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్
ఇది ఎమ్మిగనూరు నియోజకవర్గం పుట్టపాశం దళితవాడలో మేం నిర్మించిన సిసి రోడ్డు తాలూకు శిలాఫలకం. నేను పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేసిన రెండున్నరేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు వేశాను. నాలుగేళ్ల జగన్ రెడ్డి గారి జమానాలో కొత్తరోడ్ల నిర్మాణం మాట దేవుడెరుగు, గోతుల్లో తట్ట మట్టిపోసే దిక్కులేదు. వర్షం వస్తే రోడ్లు తటాకాలను తలపిస్తున్నాయి. రోడ్లువేయడానికి టెండర్లు పిలచినా జగన్ మొఖం చూసి కాంట్రాక్టర్లు పరారవుతున్నారు. దిక్కుమాలిన పాలనతో జనానికి చుక్కలు చూపిస్తూ రాజుగారి ఒంటిమీద దేవతా వస్త్రాల మాదిరిగా అంతా బాగుందని డబ్బాలు కొట్టించుకోవడం పులకేశి పాలనలో మాత్రమే సాధ్యం!