– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్
రాయలసీమ పల్లెల్లో 10రోజులకు ఒకసారి కూడా గుక్కెడు నీళ్లందక ప్రజలు పడుతున్న అవస్థలు చూసి నా కళ్లు చెమరుస్తున్నాయి. సీమజనం పడుతున్న తాగునీటి కష్టాలకు ఈ ప్లాస్టిక్ బిందెలే నిదర్శనం. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్ తాడేపల్లి ప్యాలెస్ కూర్చుని ప్రజలను గాలికొదిలేశారు. ఇది ఎమ్మిగనూరు నియోజకవర్గం పుట్టపాశం గ్రామంలో రక్షిత మంచినీటి పథకం. నియోజకవర్గంలో నీటికష్టాలు తీర్చాలని టిడిపి హయాంలో ఇటువంటి 11 రక్షిత మంచినీటి పథకాలను రూ.13.5కోట్లతో నిర్మించాం. వైసిపి ప్రభుత్వం వచ్చాక గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైప్ లైన్లు వేసి నీరివ్వడం చేతగాక పాడుబెట్టారు. అధికారంలోకి వచ్చాక దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఒక్క మంచినీటి కుళాయి అయినా వేశావా జగన్మోహన్ రెడ్డీ?!