– భాజపా,తెదేపా,జనసేన పార్టీ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య
నందిగామ : డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు రెండున్నర కోట్ల రూపాయలు డీఎస్పీ పోస్టుకు కోటిన్నర చొప్పున 30 డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు 25 డిఎస్సి పోస్ట్లు స్కామ్ జరిగింది. అర్హులైన వారికి న్యాయం జరగలేదు దీనిని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ నోటిఫికేషన్ గత తెలుగుదేశ ప్రభుత్వం మా హయాంలోనే విడుదల చేయడం జరిగినది.
దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం వైసీపీ ప్రభుత్వం లోనే జరిగినది. ఈ ప్రక్రియ అంతటిలో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ వైసిపి ప్రభుత్వం వారి వద్ద నుంచి భారీగా నగదు స్కాం చేయడం జరిగినది. నిజంగా అర్హులైన వారు ఈ స్కాం వలన అన్యాయమైపోయారు.
దీనిపైన స్వయంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి మొట్టికాయలు వేసింది దీన్ని అంతటిని రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూనే ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీపై మచ్చ వేసి ఒక సామాజిక వర్గానికే 35 డీఎస్సీ పోస్టులు ఇచ్చారని.. మరి ఈరోజు జరిగిన ఈ స్కామ్ కి ఏం సమాధానం చెబుతారు జగన్మోహన్ రెడ్డి? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు తీసుకుని అర్హులైన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.