హై కోర్ట్ తీర్పు జగన్ సర్కారుకు చెంప పెట్టు

– ఇది ఎపిపిఎస్సి నా? వైసిపిఎస్సినా?
– వైకాపా చేపట్టిన గ్రూప్ 1,2 పోస్టుల భర్తీ నిలిపివేస్తూ హై కోర్ట్ ఇచ్చిన తీర్పు జగన్ సర్కారుకు చెంప పెట్టు
– గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ
– అక్రమార్కులపై సిబిఐ విచారణ జరపాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ, టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మన్నవ వంశి,తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్

2018 గ్రూప్-1 మెయిన్స్ నోటిఫికేషన్ కు సంబంధించి 2019 లో జరిపిన ప్రిలిమ్స్ 2020 లో జరిపిన మెయిన్స్ పరీక్షల డిజిటల్ మూల్యంకనంలో ఒమర్ షీట్లు మార్చి వైకాపా ప్రభుత్వం ఎపిపిఎస్సిని వైసిపిఎస్సిగా మర్చి 169 పోస్టులు అమ్ముకోవటాన్ని నిరసిస్తూ అక్రమ మార్గంలో భర్తీ అయిన పోస్టులను రద్దు చేస్తూ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిసస్తూ గుంటూరు జిల్లా తెలుగుయువత అద్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో టిఎస్ఎస్ఎఫ్ – నిరుద్యోగులతో కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినూత్న రీతిలో తట్టల్లో గ్రూప్1,2 ఉద్యోగాల నమూనా సీల్డ్ కవర్లను పెట్టుకొని అమ్ముకుంటూ కలెక్టర్ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లి ప్రధాన ద్వారం ముందు ఉద్యోగాలను అమ్ముతూ నిరసన తెలియజేసారు.

తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ గ్రూప్ 1,2 అభ్యర్థిగా సూట్ కేసుతో తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఉద్యోగాల విక్రయదారునిగా అప్పోయింట్మెంట్ ఆర్డర్ నమూనాతో చేపట్టిన స్కిట్ చూపరులను ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా బాబు,జిల్లా టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పినపాటి జీవన్,గుంటూరు పశ్చిమ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు కంచర్ల ధర్మతేజ,జిల్లా తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్సులు షేక్ రషీద్,మన్నెం శ్రీనివాసరావు,కార్యదర్సులు ఈదర త్రినాద్,మాచవరపు దాసు,పఠాన్ అథావుల్లా ఖాన్,గుంటూరు పశ్చిమ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్,ఉపాధ్యక్షులు పప్పుల రాంబాబు,తూర్పు పశ్చిమ తెలుగుయువత కార్యనిర్వాహక కాద్యదర్సులు శ్రీపతి రాంబాబు,కోలా మల్లికార్జున రావు,మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రజాక్,47వ డివిజన్ టిడిపి అధ్యక్షులు దాది గోపాల్ యాదవ్,కొల్లా నాగ సుబ్బారావు, తెలుగుయువత నాయకులు చిక్కాల శివరామ కృష్ణ,చింతా వినోద్ ,శొంఠినేని అనిల్,బుల్లా కుమార్ బాబు,సన్నపు ఆదిత్య రెడ్డి,శశి తతితరులు పాల్గున్నారు

Leave a Reply