వైసీపీ మునిగేనావ

– దూకకపోతే నష్టపోతారు
– వైసీపీ కార్యకర్తలారా.. టీడీపీలోకి రండి
– ఇంకా వైసీపీలో ఉంటే జనం క్షమించరు
– కలసి అభివృద్ధి సాధిద్దాం
కార్యకర్తలకోసం ఎక్కడదాకైనా వెళ్లేందుకు సిద్ధం
– మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పిలుపు
– సతె్తనపల్లిలో కన్నా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

సత్తెనపల్లి: ‘‘వైసీపీ ఇప్పుడు మునిగేపోయేనావ. ఇంకా అందులో ప్రయాణిస్తే మునిగిపోవడం ఖాయం. దూకేసి మిమ్మల్ని కాపాడుకోండి. ఇంకా అక్కడే ఉంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అభివృద్ధికి టీడీపీ కేరాఫ్ అడ్రస్. మీరంతా టీడీపీలోకి వచ్చేయండి. కలసి అభివృద్ధి సాధిద్దాం. కార్యకర్తలను గౌరవించే పార్టీ టీడీపీ మాత్రమే అని గ్రహించండి’’ అని మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

సత్తెనపల్లి నియోజకవర్గం రూరల్ మండలంలోని భీమవరం గ్రామంలో వైసీపీ మండలనేతలు దామచర్ల శ్రీనివాసరావు, దామచర్ల ఏడుకొండలు, మన్నెం తుణ్ పాపినేని ఇతర వైసీపీ నేతలు కన్నా సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పిన కన్నా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ.. కీలకమైన ఎన్నికల సమయంలో మంచినిర్ణయం తీసుకున్నారని అభినందించారు. కలసి అభివృద్ధి చేద్దామని, ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. కార్యకర్తలకోసం ఎక్కడదాకైనా వెళ్లేందుకు సిద్ధం అని కన్నా వారికి భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పరిశీలకులు తాతా జయప్రకాశ్ నారాయణ, మండల పార్టీ అధ్యక్షులు ఆళ్ళ అమరేశ్వరావు , గంగూరి వెంకట్రావు, దరువురి నాగేశ్వరావు, కట్టా రమేష్, తోరటి వెంకట్రావు, గొలుసుపాటి వెంకటసుబ్బయ్య , గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply