– సర్పంచుల అరెస్టును ఖండిస్తున్నాం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు
జగన్ రెడ్డి పాలనలో గ్రామ సర్పంచులు దగాపడ్డారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి జగన్ సర్కార్ మంగళంపాడింది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా అభివృద్ధి నిధులను విడుదల చేయలదు. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 14, 15 ఆర్థిక సంఘం నుండి విడుదలైన రూ.8,608కోట్లను ప్రభుత్వం దారిమళ్లించి సర్పంచులు, పంచాయతీల నోట్లో మట్టికొట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,918 పంచాయతీ సర్పంచులు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటాలను ఉక్కు పాదంతో అణగదొక్కుతోంది. అలిపిరి నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టి, తమ సమస్యలను వెంకన్నస్వామికి చెప్పుకునేందుకు బయల్దేరిన సర్పంచులను, సర్పంచుల సంఘం నేతలను పోలీసులు నిర్బంధించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అరెస్టు చేసిన సంఘం నేతలను తక్షణమే విడుదల చేయాలి. పంచాయతీల నుండి లాక్కున్న నిధులను తిరిగి వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం.